చంద్రబాబుపై అడ్వకేట్ జేఏసీ ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చెందిన ముఖ్య వ్యక్తుల సెల్‌ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయాలని ఓర్టస్ అనే ఒక ప్రై వేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వికీలీక్స్ బయటపెట్టిన నేపద్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణా అడ్వకేట్ జేఏసీ సభ్యులు శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణా ప్రభుత్వంపై మరో కుట్ర జరిపిందేకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు చేసినవారిలో న్యాయవాదులు కే.గోవర్దన్‌రెడ్డి, పి. గోవర్దన్‌రెడ్డి, ఉపేంద్ర, సదానందం, వెంటేశ్వర్లు తదితరులు ఉన్నారు.