వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా పద్మజ
Published Fri, Aug 19 2016 10:05 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
జగిత్యాల అగ్రికల్చర్: పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా డాక్టర్ పద్మజ నియమిస్తూ ప్రొపెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటివరకు హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఇక్కడ ఇన్‌ఛార్జి అసోసియేట్ డీన్‌గా వ్యవహరించిన జయశ్రీ మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాలకు బదిలీ అయ్యారు. కళాశాల అభివృద్ధికి శాయశక్తులా కృషి కృషిచేస్తానని పద్మజ అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ.. అందరి భాగస్వామ్యంతో కళాశాలను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు.
Advertisement
Advertisement