డెంగీ నివారణకు కృషి చేయాలి
-
కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్ : డెంగీ వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌శాఖలు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజ్ఙా సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మా ట్లాడారు. జిల్లాలో బొనకల్లు , తల్లాడ, కొణిజర్ల, ఖమ్మంలో డెంగీకేసులు నమోదవుతున్నందున ఆయా ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాల ని అధికారులకు సూచించారు. రక్త నమూనా లో డెంగీ వ్యాధి పాజిటివ్‌గా వచ్చినా ఆందో ళన చెందవద్దన్నారు. డెంగీ వ్యాధి కేసులు జిల్లా ఆస్పత్రికి వచ్చిన వారందరికీ చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉండాలని డీసీహెచ్‌ఎస్‌కు సూచించారు. డెంగీ వ్యాధి పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిన తరువాతనే ఇంటికి పంపాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నందున వైద్యవిధాన పరిషత్ వైద్య అధికారులు కావాల్సిన చోటుకు వెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ సమన్వయ వైద్యాధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రం ద్వారా సేకరిస్తున్న రక్త నమూనాలను సాయంత్రంలోగా రక్త నమూనా ఫలితాల ప్రకారంగా చికిత్స మొదలు పెట్టా లన్నారు. డెంగీ దోమలు గృహల్లో ఉంటా యని , మలేరియా దోమలు బయట ఉం టా యని ప్రస్తుత వాతావరణంలో డెంగీ దోమలు 25 రోజుల వరకు జీవించి ఉంటాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది గ్రామంలో అప్రమత్తంగా ఉండాలని నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. టైర్లు, కొబ్బరి బోండాలు , పశువుల దొడ్లు ఎప్పటికప్పుడు నీరు నిల్వ లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎం అండ్‌హెచ్‌ఓ కొండలరావు, వైద్యవిధాన పరిషత్ జిల్లా సమన్వయ అధికారి ఆనందవాణి, డీపీఓ నారాయణరావు, ఐసీడీఎస్‌పీడీ జ్యోతిర్మయి పాల్గొన్నారు.