ఆల్‌ ఇన్‌ వన్‌ | all in one teacher in haripuram | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇన్‌ వన్‌

Published Sat, Oct 22 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

ఆల్‌ ఇన్‌ వన్‌

ఆల్‌ ఇన్‌ వన్‌

పెనుకొండ రూరల్‌ : ఆల్‌ ఇన్‌ వన్‌.. టూ ఇన్‌ వన్‌.. వ¯Œన్ బై టు లాంటివి ఎప్పుడో ఒకసారైతే బానే ఉంటాయిగానీ సంవత్సరాల తరబడి వీటిని కొనసాగిస్తూనే ఉంటే చూసేవాళ్లక్కూడా మా చెడ్డ చిరాకేస్తుంది. ఆ పరిస్థితిని అనుభవించేవాళ్లు ఎంతటి శాంతమూర్తులైనా అప్పుడప్పుడూ వారికీ కోపం తన్నుకొస్తుంది. ఇలాంటి దుస్థితి పెనుకొండ మండలం హరిపురంలో దాదాపు పదిహేనేళ్లుగా ఉంది. ఈ గ్రామంలో ముప్పయేళ్ల క్రితం ఒకే గదితో భవనం నిర్మించి అందులో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. తర్వాత 15 సంవత్సరాల కిందట అంగన్వాడీ కేంద్రం కూడా మంజూరు చేశారు.

అయితే ప్రత్యేక భవనం లేకపోవడంతో ఈ కేంద్రానికి తాత్కాలికంగా పాఠశాల గదినే కేటాయించారు. టూఇ¯ŒS వ¯ŒS అనుకున్నారో, వ¯Œన్ బై టు అనుకున్నారో కానీ అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే వదిలేశారు. ప్రస్తుతం పాఠశాలలో ఐదుగురు విద్యార్థులున్నారు. అంగ¯ŒSవాడీ కేంద్రంలో 10 మంది పిల్లలున్నారు. అంగ¯ŒSవాడీ పిల్లల ఆలనా, పాలనా, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాల బోధన ఎంత ఇబ్బందికరమైనా ఆ గదిలోనే సాగిపోతున్నాయి. అంగ¯ŒSవాడీ పిల్లల సామగ్రి, విద్యార్థుల మధ్నాహ్న భోజన సరుకులు, వంట, భోజనం అన్నీ ఆ గదిలోనే చేయాల్సి వస్తోంది. దీంతో పాఠశాల టూకీగా చూసేవాళ్లకు టూ ఇన్‌ వన్‌గా, కొంత పరిశీలనగా చూసేవాళ్లకు ఆల్‌ ఇన్‌ వన్‌గా కనిపిస్తుంది.

శాంతమూర్తులు
అంగ¯Œన్వాడీ కార్యకర్త గంగాభవాని, ఆయా నారాయణమ్మ 15 ఏళ్లుగా ఎంతో ఓపికతో ఇబ్బందులను అధిగమిస్తూ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యాసాగర్‌ కూడా నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు అని మాత్రం చెప్పవచ్చు. ఎలాగంటే పాఠశాలలో విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నందున ఈ గ్రామంలో బడి మూసేసే పరిస్థితి నెలకొంది. ఇక అప్పుడు అంగ¯ŒSవాడీ కేంద్రం ఒక్కటే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారమైపోయినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement