all in one
-
డెస్క్‌టాప్స్ మళ్లీ ఊపందుకున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ వచ్చాక డెస్క్‌టాప్ కంప్యూటర్ల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కార్యాలయాల్లో మాత్రం ఇప్పటికీ డెస్క్టాప్స్ను వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా సంప్రదాయ డెస్క్‌టాప్ పీసీల స్థానాన్ని ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు ఆక్రమించుకుంటున్నాయి. అయితే భారత్‌లో ఈ ఏడాది జనవరి–మార్చిలో పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆల్ ఇన్ వన్స్‌తో కలిపి డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు సుమారు 5.2 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2020 జనవరి–మార్చితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ తరగతుల మూలంగా వీటికి తిరిగి డిమాండ్ వచ్చింది. విద్యార్థుల కోసం గతేడాది ట్యాబ్లెట్ పీసీలను ఎంచుకున్న కస్టమర్లు ఈ ఏడాది డెస్క్‌టాప్‌లకు మళ్లారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆఫ్‌లైన్‌లోనే అధికం.. ఆల్ ఇన్ వన్స్ పూర్తిగా వ్యవస్థీకృత రంగానిదే. ఈ విభాగంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ఇక డెస్క్‌టాప్స్‌లో అసెంబుల్డ్ వాటా 65–70 శాతం, మిగిలినది బ్రాండెడ్ కంపెనీలది. వీటికి కావాల్సిన విడిభాగాలను 100 వరకు టాప్ బ్రాండ్లు, 250 దాకా లోకల్ బ్రాండ్స్ సరఫరా చేస్తున్నాయి. 95 శాతం డెస్క్‌టాప్స్ అమ్మకాలు ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. డెస్క్‌టాప్స్ రూ.17,000ల నుంచి రూ.65,000 వరకు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్స్ ధరల శ్రేణి రూ.24–70 వేల వరకు ఉంది. గేమింగ్ శ్రేణి రూ.45,000 నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ల్యాప్టాప్స్ రూ.20 వేల నుంచి లభిస్తాయి. ఇదీ పీసీ మార్కెట్.. దేశవ్యాప్తంగా 2021 జనవరి–మార్చిలో సుమారు 31 లక్షల ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, వర్క్‌స్టేషన్స్ అమ్ముడయ్యాయి. తొలి త్రైమాసికంలో ఈ స్థాయి విక్రయాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 2020 క్యూ1తో పోలిస్తే 73.1 శాతం వృద్ధి నమోదైందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ చెబుతోంది. పీసీ మార్కెట్లో 75 శాతంపైగా వాటాతో దూసుకెళ్తున్న ల్యాప్టాప్స్ అమ్మకాలు 116.7 శాతం అధికమయ్యాయి. తొలి స్థానంలో ఉన్న హెచ్‌పీ వాటా 32.9 శాతంగా ఉంది. రెండవ స్థానంలో నిలిచిన డెల్ టెక్నాలజీస్ 21.8 శాతం వాటా కైవసం చేసుకుంది. లెనోవో 20.1 శాతం, ఏసర్ గ్రూప్‌నకు 7.7 శాతం వాటా ఉంది. పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే అమ్మకాలు 10 శాతం ఉంటాయని పరిశ్రమ వర్గాల సమాచారం. అప్‌గ్రేడ్‌కు అనువైనవి.. గతేడాది ఒక్కసారిగా ఆన్లైన్ క్లాసులు తెరపైకి రావడంతో కస్టమర్లు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ఫోన్లను కొన్నారు. దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డెస్క్టాప్స్కు మళ్లారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు సైతం వీటిని ఎంచుకుంటున్నారు. అప్‌గ్రేడ్ విషయంలో ల్యాప్‌టాప్‌తో పోలిస్తే డెస్క్‌టాప్ అనువైనది. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా హార్డ్ డిస్క్, ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్, ఎస్ఎస్డీ సులువుగా మార్చుకోవచ్చు. నచ్చిన సైజులో స్క్రీన్‌ను, కావాల్సిన కెమెరాను అమర్చుకోవచ్చు. పైగా దీర్ఘకాలిక మన్నిక కూడా. – అహ్మద్, ఎండీ, ఐటీ మాల్ -
అన్ని లావాదేవీలకు ఒకే క్యూఆర్ కోడ్
రోజురోజుకు డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్‌పే, పేటిఎం వంటి క్యూఆర్ కోడ్లు కనిపిస్తుంటాయి. ఈ తరహాలోనే పేటీఎం ఇటీవల దేశవ్యాప్తంగా ఆల్-ఇన్-వన్ క్యూఆర్ కోడ్‌ను పేటీఎం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వ్యాపారులు కేవలం వ్యాలెట్, యూపీఐ ద్వారా మాత్రమే కాకుండా రూపే కార్డుల నుంచి చెల్లింపులను అందుకునే వీలుంది. అంతేకాదు, ఇలాంటి చెల్లింపులకు ఎండీఆర్ చార్జీలు కూడా విధించలేదు. ఈ క్యూఆర్ కోడ్ వ్యాపారుల కోసం పేటీయం రూపొందించిన 'పేటీయం ఫర్ బిజినెస్ యాప్' ద్వారా వస్తుంది. దీని ద్వారా వ్యాపారులు ఎన్ని విధాలుగా అయినా అన్లిమిటెడ్ పేమెంట్లను ఆమోదించవచ్చు. కేవలం చెల్లింపులు మాత్రమే కాకుండా వ్యాపారులతో మరింత అనుబంధం కోసం మర్చంట్ సొల్యూషన్స్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో కూడా పేటీఎం ఉన్నట్లు సమాచారం. ఇన్స్టంట్ బ్యాంక్ సెటిల్మెంట్, రియల్ టైమ్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. మొదట వ్యాలెట్గానే ఉన్నప్పటికీ క్రమంగా పేటీయంకు యూపీఐని కూడా జత చేశామని, నేడు రూపే కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరిపే ఫీచర్‌ను జోడించినట్లు వ్యవస్థాపకులు వెల్లడించారు. 2019లో 900 కోట్ల క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు జరగ్గా అందులో 500 కోట్ల చెల్లింపులు పేటీయం ద్వారానే జరిపినట్టు అధికారంగా తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ మార్కెట్లో మొత్తం 50కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ ఫీచర్ పేటీయం ప్రత్యర్థి సంస్థలు గూగుల్ పే, ఫోన్ పేల్లో అందుబాటులో లేదు. పేటీఎం ఆల్-ఇన్-వన్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను కాలిక్యులేటర్, పవర్ బ్యాంక్, క్లాక్, పెన్ స్టాండ్స్, రేడియో లాంటివాటిపై అందిస్తోంది. వ్యాపారి పేర్లు, లోగోలు, ఫోటోలతో కూడా క్యూఆర్ కోడ్ ఆర్డర్ చేయొచ్చు. -
ఆల్ ఇన్ వన్
పెనుకొండ రూరల్ : ఆల్ ఇన్ వన్.. టూ ఇన్ వన్.. వ¯Œన్ బై టు లాంటివి ఎప్పుడో ఒకసారైతే బానే ఉంటాయిగానీ సంవత్సరాల తరబడి వీటిని కొనసాగిస్తూనే ఉంటే చూసేవాళ్లక్కూడా మా చెడ్డ చిరాకేస్తుంది. ఆ పరిస్థితిని అనుభవించేవాళ్లు ఎంతటి శాంతమూర్తులైనా అప్పుడప్పుడూ వారికీ కోపం తన్నుకొస్తుంది. ఇలాంటి దుస్థితి పెనుకొండ మండలం హరిపురంలో దాదాపు పదిహేనేళ్లుగా ఉంది. ఈ గ్రామంలో ముప్పయేళ్ల క్రితం ఒకే గదితో భవనం నిర్మించి అందులో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. తర్వాత 15 సంవత్సరాల కిందట అంగన్వాడీ కేంద్రం కూడా మంజూరు చేశారు. అయితే ప్రత్యేక భవనం లేకపోవడంతో ఈ కేంద్రానికి తాత్కాలికంగా పాఠశాల గదినే కేటాయించారు. టూఇ¯ŒS వ¯ŒS అనుకున్నారో, వ¯Œన్ బై టు అనుకున్నారో కానీ అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే వదిలేశారు. ప్రస్తుతం పాఠశాలలో ఐదుగురు విద్యార్థులున్నారు. అంగ¯ŒSవాడీ కేంద్రంలో 10 మంది పిల్లలున్నారు. అంగ¯ŒSవాడీ పిల్లల ఆలనా, పాలనా, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాల బోధన ఎంత ఇబ్బందికరమైనా ఆ గదిలోనే సాగిపోతున్నాయి. అంగ¯ŒSవాడీ పిల్లల సామగ్రి, విద్యార్థుల మధ్నాహ్న భోజన సరుకులు, వంట, భోజనం అన్నీ ఆ గదిలోనే చేయాల్సి వస్తోంది. దీంతో పాఠశాల టూకీగా చూసేవాళ్లకు టూ ఇన్ వన్‌గా, కొంత పరిశీలనగా చూసేవాళ్లకు ఆల్ ఇన్ వన్‌గా కనిపిస్తుంది. శాంతమూర్తులు అంగ¯Œన్వాడీ కార్యకర్త గంగాభవాని, ఆయా నారాయణమ్మ 15 ఏళ్లుగా ఎంతో ఓపికతో ఇబ్బందులను అధిగమిస్తూ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యాసాగర్ కూడా నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు అని మాత్రం చెప్పవచ్చు. ఎలాగంటే పాఠశాలలో విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నందున ఈ గ్రామంలో బడి మూసేసే పరిస్థితి నెలకొంది. ఇక అప్పుడు అంగ¯ŒSవాడీ కేంద్రం ఒక్కటే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారమైపోయినట్లే.