అమర జవాన్లకు ఘన నివాళి
తీవ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్లకు నర్సరీ రైతులు తమ శైలిలో నివాళులర్పించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో వివిధ రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో ఎల్లవేళలా పోరాడే సైనికుల సేవా నిరతి ప్రతిక్షణం మనం స్మరించుకోవాలని నర్సరీ రైతులు పల్ల సత్యనారాయణమూర్తి, పల్ల సుబ్రహ్మణ్యం, పల్లగణపతి, పల్ల వెంకటేష్ తెలిపారు.
– కడియం