- ∙అంగట్లో ఏఎంసీ చైర్మ¯ŒS గిరీ
- ∙సంపర కమిటీ పీఠం మరింత కీలకం
- ∙చక్రంతిప్పిన రూరల్ రాజ్యాంగేతర శక్తి
రూ.30 లక్షలిచ్చినా ముప్పుతిప్పలే..!
Published Fri, Nov 11 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
సాక్షిప్రతినిధి, కాకినాడ :
తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టులు అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS పీఠాలకు రేట్లు నిర్ణయించడమనేది పాత విషయమే అయినా సరికొత్త పద్ధతుల్లో దందాను కొనసాగిస్తున్నారు. కోనసీమలో అంబాజీపేట మొదలుకుని నగరం, తాటిపాక, అల్లవరం..ఇలా దాదాపు అన్ని ఎఎంసీ చైర్మ¯ŒS పీఠాలను అంగట్లో పెట్టి అమ్మేసుకున్నవే. ఏడెనిమిది లక్షలు నుంచి రూ.15 లక్షలు వరకు వీటి ధర పలుకుతోంది. చివరకు టీడీపీలో సీనియర్లు కూడా సొమ్ములు ఇవ్వకుండా పోస్టులు పొందలేకపోయారంటే పార్టీలో పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 22 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో భర్తీ కాని సంపర మార్కెట్ కమిటీ చాలా కీలకమైంది. ఎందుకంటే ఆ కమిటీ నాలుగు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ మార్కెట్ కమిటీ పన్నుల రూపంలో ఏటా కోటి రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఏఎంసీలున్నా రాజకీయంగా సంపర కమిటీ చైర్మ¯ŒS పదవి చాలా కీలకమైంది. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట, అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి, పిఠాపురం నియోజకవర్గంలో యు.కొత్తపల్లి, నియోజకవర్గ కేంద్ర మండలం కాకినాడ రూరల్, అదే నియోజకవర్గంలోని కరప మండలం నడకుదురు గ్రామంతో కలిసి సంపర వ్యవసాయ మార్కెట్ కమిటీగా ఉంది. ఉప ముఖ్యమంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేల పరిధిలో ఈ కమిటీ ఉండటంతో జిల్లాలో చాలా ప్రాధాన్యం ఉన్న కమిటీగా సంపరకు పేరుంది. అందుకు తగ్గట్టు చైర్మ¯ŒS గిరీ కోసం నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు పలువురు నేతలను ప్రతిపాదించారు.
మా గతేంగాను...
పార్టీలో మొదటి నుంచీ ఉన్న తమ పరిస్థితి ఏమిటని మిగిలిన సీనియర్లు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఈ చైర్మ¯ŒS గిరీని కాకినాడ రూరల్ మండలం నుంచి పుల్లా ప్రభాకరరావు, రామదేవు సీతయ్యదొర, కర్రి సత్యనారాయణలు ఆశిస్తున్నారు. వీరిలో ప్రభాకరరావు పార్టీలో సీనియర్. ఇతనికి వరుసకు కుమారుడైన పుల్లా సుధాచంద్ర రూరల్ ఎంపీపీగా ఉండటంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం రాదని వెనక్కు పెట్టారంటున్నారు. మరో సీనియర్ నాయకుడు సీతయ్యదొర. ఎన్టీఆర్æ వీరాభిమాని. ఆవిర్భావం నుంచి పార్టీ జెండా భుజాన మోసిన దొర పట్టుబడుతున్నారు. ఈ ముగ్గురులో చైర్మ¯ŒS గిరీ ఎవరిని వరిస్తుందా అని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.రూ.30 లక్షలు మింగేసి చైర్మ¯ŒS పీఠం ఇవ్వకపోగా, వైస్ చైర్మ¯ŒS పోస్టు కోసం అనపర్తి, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పోటీ నెలకొనడంతోనే చైర్మ¯ŒSగిరీ పెండింగ్‌లో ఉందని రూరల్ నేత ఒకరు బుజ్జగిస్తున్నారు. ఎవరో ఒకరికి చైర్మ¯ŒS ఇవ్వకుండా ఇంకా ఎంత కాలం ఇలా జాప్యం చేస్తారని తమ్ముళ్లు మండిపడుతున్నారు.
ఆ ప్రాతినిధ్యం మాదే కావాలి...
ఆ చైర్మ¯ŒS గిరీ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో తమ నియోజకవర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ముఖ్యనేత పట్టుబడుతున్నారు. గత కాంగ్రెస్ హయాంలో పెదపూడి మండలానికి చెందిన అద్దంకి ముక్తేశ్వరరావు చైర్మ¯ŒSగా వ్యవహరించారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా కాపు సామాజిక వర్గానికే కేటాయించాలని ఆ ముఖ్యనేత ప్రతిపాదించారు. నియోజకవర్గంలో అన్నింటా తానై రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న ముఖ్య నాయకుడు చైర్మ¯ŒSగిరీ కోసం అంతగా పట్టుబట్టడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఈ చైర్మ¯ŒS పీఠానికి ముఖ్యనేత రూ.30 లక్షలుగా నిర్ణయించి మెజార్టీ సొమ్ము ఇప్పటికే జేబులో వేసుకున్నాడని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలు, చివరకు మంత్రుల పర్యటనల ఖర్చు కూడా చైర్మ¯ŒS ఆశిస్తున్న కాకినాడ రూరల్‌కు చెందిన ఒక నాయకుడే భరిస్తున్నాడు. ఆ ఖర్చుతోపాటు రెండు దఫాలు (రూ.16 లక్షలు ఒకసారి, రూ.9 లక్షలు మరోసారి) మొత్తంగా రూ.25 లక్షలు నియోజకవర్గ ముఖ్యనేతకు ముట్టజెప్పారని పార్టీలో చర్చ జరుగుతోంది. ముందుగా కుదిరిన డీల్ రూ.30 లక్షలు ప్రకారం చూస్తే పాతిక లక్షలు ఇప్పటికే ముట్టజెప్పగా, ఏడాదిన్నర ఖర్చుల కింద మిగిలిన ఐదు లక్షలు చూసుకోవాలని చైర్మ¯ŒS రేసులో ఉన్న నాయకుడు లెక్కలు చెప్పారని తెలిసింది. అన్ని లక్షలు తీసుకున్నప్పటికీ ఆ ముఖ్యనేత చైర్మ¯ŒS గిరీ ఈవేళ, రేపు అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న తీరుతో చేతి చమురు వదుల్చుకున్న నేత వర్గీయులు మండిపడుతున్నారు.
Advertisement