amc chairman
-
ఇక్కడెలా పని చేస్తావో చూస్తా..!
సాక్షి ప్రతినిధి,ఏలూరు : ఇక్కడ ఎలా పని చేస్తావో.. త్వరలోనే నీ అంతు చూస్తా.. అంటూ ఎస్టేట్ మహిళా అధికారిపై ఏఎంసీ చైర్మన్ చిందులు వేశాడు. ఆదివారం స్థానిక ఫత్తేబాద్ రైతు బజారులో రైతులు, ఎస్టేట్ అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో కొందరు రైతులు ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. రైతులతో తరచూ గొడవలు ఎందుకు పడుతున్నావంటూ ఎస్టేట్ అధి కారిని గట్టిగా నిలదీశారు. ఏఎంసీ చైర్మన్, రైతుబజారులో కొందరు కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్టేట్ అధికారి శ్రీలత ఆరోపించారు. తనపై దౌర్జన్యం చేసేందుకు ఏఎంసీ చైర్మన్ నిరంజన్ సొంత మనుషులతో వచ్చారన్నారు. ఆమె టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఎస్టేట్ అధికారి శ్రీలత మాట్లాడుతూ తనను కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని, రైతు బజారులో ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి నచ్చిన చోట కూరగాయల విక్రయానికి షాపులు ఇవ్వాలని తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, నిబంధనల ప్రకారం పని చేస్తున్నందుకు తనను బదిలీ చేయించాలని తప్పుడు సంతకాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆ ప్రజాప్రతినిధి దగ్గర బంధువు చెప్పినట్టుగా ధరల పట్టిక పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, దానివలన వినియోగదారులు నష్టపోతారని తాను నిరాకరించడంతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఓ మహిళ అధికారితో మాట్లాడాల్సినట్టుగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడడం లేదని, తన అంతూ చూస్తానంటూ హెచ్చరించారని ఆమె వాపోయారు. రైతుబజారులో కొందరు ఓ వర్గంగా ఏర్పడి తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎస్టేట్ అధికారి శ్రీలత పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం రైతు బజారు దళారి వ్యవస్థను రూపుమాపేందుకు , రైతు సంక్షేమం కోసమే రైతుబజార్లు ఏర్పాటు చేశారని ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ అన్నారు. ఎస్టేట్ అధికారి తమను వేధింపులకు గురి చేస్తున్నారని రైతులు తనకు ఫిర్యాదు చేశారని, దీనిపై అధికారిని వివరణ కోరానని, విచారణ చేసి రైతులను వేధింపులకు గురి చేసినట్లుగా రుజువైతే సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న చేరికలు
పిఠాపురం: ప్రజా సంకల్పయాత్రలో భాగంలో పాదయాత్ర చేస్తోన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్ రామకృష్ణతో పాటు మరో ఆరుగురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి వైఎస్ జగన్, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ..టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలతో మోసపోయామని, మాజీ చైర్మన్ అయిన తనకే రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో మరికొంత మంది చేనేత సంఘాల ప్రతినిధులు కలిసి తమ ఇబ్బందులు వైఎస్ జగన్‌తో చెప్పుకున్నారు. జీఎస్టీతో ఇబ్బందులు పడుతున్నామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు చేయాలని విన్నవించుకున్నారు. పిఠాపురం జాతీయ రహదారిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. 2014 ఎన్నికలకు ముందు తమకు కూడా ఇళ్ల స్థలాలు, డెత్ బెనిఫిట్స్ మంజూరు వంటి అనేక హామీలు చంద్రబాబు ఇచ్చాడని వైఎస్ జగన్‌కు చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజల్లానే తమను కూడా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు స్టైఫండ్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ జగన్‌కు న్యాయవాదులు వినతిపత్రం సమర్పించారు. -
టీడీపీకి బాబ్జీ రాజీనామా
వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటన గొల్లప్రోలు (పిఠాపురం): పట్టణా నికి చెందిన పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ మొగలి వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ) టీడీపీకు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు పంపినట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తన రాజకీయ గురువు దివంగత మాదేపల్లి రంగబాబు ఆకస్మిక మరణంతో స్థానికంగా టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ విజయంతోపాటు నగర పంచాయతీ ఎన్నికల్లో కౌన్సిలర్లు గెలుపునకు ఎనలేని కృషి చేశానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనకు పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహారశైలి మనస్థాపానికి గురిచేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సూచన మేరకు రెండు రోజుల్లో తనతోపాటు తన అనుచరులు, అభిమానులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నానన్నారు. -
కౌన్ బనేగా చైర్మన్!
మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీకాలం ఏడాది ఉంటుంది. ఏడాది పూర్తయిన తర్వాత ఆరు నెలల పాటు పొడగించవచ్చు. ఇలా ఆరు నెలల చొప్పున కేవలం రెండుసార్లు (ఏడాది) మాత్రమే పొడగించడానికి వీలుంటుంది. నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుండడంతో మళ్లీ పదవుల పందేరానికి తెరలేవనుంది. రిజర్వేషన్లు సైతం మారాయి. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం నానా పాట్లు పడుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మార్కెట్ కమిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో పదవు లు ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేల ఆశీస్సులు పొందే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈసారి ఎలాగైన అవకాశం తమకు ఇవ్వా లని కోరుతున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు పలువురు గతంలో మార్కెట్ కమిటీ పదవులు ఆశించినా.. రిజర్వేషన్లు కలిసి రాక నిరాశ చెందారు. ఈసారి రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న నేతలు ఈ పదవులను కైవసం చేసుకోవడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కావడంతో పదవుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు ఆచితూ చి వ్యవహరించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయంగా తమకు కలిసొచ్చే విధంగా ఈ పదవుల ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో పలు మార్కెట్ కమిటీ పదవుల ఎంపిక విషయంలో మొదటిసారి కొన్ని విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి విమర్శలకు తావులేకుండా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రిజర్వేషన్లు.. ఆయా మార్కెట్ కమిటీల పాలకవర్గం రెండేళ్లకు మించి పనిచేయడానికి వీలు లేదు. ఇప్పటికే పలు పాలకవర్గాల పదవీ కాలం రెండేళ్లు పూర్తయ్యింది. దీంతో కొత్త పాలకవర్గాల ఎంపిక కోసం రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్లు మారుతుండడతో కొత్త వారిని నియమించడం అనివార్యం అవుతుంది. మారిన రిజర్వేషన్ల మేరకు కొత్త పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో పదవుల పందేరం జిల్లాలో షురువైంది. 17 మార్కెట్ కమిటీలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 17 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి.. వర్ని, కోటగిరి, కమ్మర్పల్లి, వేల్పూర్ మార్కెట్ కమిటీల పాలకవర్గం పదవీకాలం గతేడాదే ముగిసింది. రెండు పర్యాయాలు ఆరు నెలల చొప్పున పొడిగించారు. పొడగించిన పదవీ కాలం కూడా ఈనెల 22నే ముగిసింది. దీంతో ఈ మార్కెట్ కమిటీలకు కొత్త వారిని నియమించాల్సి ఉంది. బోధన్, ఆర్మూర్ పాలకవర్గాలు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోనే అత్యంగా పెద్ద మార్కెట్ కమిటీల్లో ఒకటైన నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం చాలా ఆలస్యంగా నియామకమైంది. ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. మారనున్న రిజర్వేషన్ల మేరకు ఈ పదవి జనరల్‌కు కేటాయించారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం పొడగించిన పదవీకాలం ఏప్రిల్ 22తో ముగిసింది. అలాగే కామారెడ్డి, భిక్కనూరు కమిటీల పదవీకాలం పక్షం రోజుల్లో జూన్ ఆరుతో ముగియనుంది. సదాశివనగర్, మద్నూర్, బిచ్కుంద కమిటీల పదవీకాలం జూలైలో, పిట్లం కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు వరకు, గాంధారి, ఎల్లారెడ్డి కమిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఉంది. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఈ పదవీకాలం ముగిసిన మరునాడే పాలకవర్గాలు రద్దు అవుతాయి. కొత్త రిజర్వేషన్ల మేరకు పాలకవర్గాన్ని నియమించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మార్కెటింగ్ శాఖ అధికారులను ఇన్చార్జిగా నియమిస్తారు. ఇలా ప్రస్తుతానికి బాన్సువాడ, వర్ని, బీర్కూర్, కోటగిరి, కమ్మర్పల్లి, వేల్పూర్ కమిటీలకు మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు పర్సన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. -
రూ.30 లక్షలిచ్చినా ముప్పుతిప్పలే..!
∙అంగట్లో ఏఎంసీ చైర్మ¯ŒS గిరీ ∙సంపర కమిటీ పీఠం మరింత కీలకం ∙చక్రంతిప్పిన రూరల్ రాజ్యాంగేతర శక్తి సాక్షిప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టులు అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS పీఠాలకు రేట్లు నిర్ణయించడమనేది పాత విషయమే అయినా సరికొత్త పద్ధతుల్లో దందాను కొనసాగిస్తున్నారు. కోనసీమలో అంబాజీపేట మొదలుకుని నగరం, తాటిపాక, అల్లవరం..ఇలా దాదాపు అన్ని ఎఎంసీ చైర్మ¯ŒS పీఠాలను అంగట్లో పెట్టి అమ్మేసుకున్నవే. ఏడెనిమిది లక్షలు నుంచి రూ.15 లక్షలు వరకు వీటి ధర పలుకుతోంది. చివరకు టీడీపీలో సీనియర్లు కూడా సొమ్ములు ఇవ్వకుండా పోస్టులు పొందలేకపోయారంటే పార్టీలో పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 22 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో భర్తీ కాని సంపర మార్కెట్ కమిటీ చాలా కీలకమైంది. ఎందుకంటే ఆ కమిటీ నాలుగు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ మార్కెట్ కమిటీ పన్నుల రూపంలో ఏటా కోటి రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఏఎంసీలున్నా రాజకీయంగా సంపర కమిటీ చైర్మ¯ŒS పదవి చాలా కీలకమైంది. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట, అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి, పిఠాపురం నియోజకవర్గంలో యు.కొత్తపల్లి, నియోజకవర్గ కేంద్ర మండలం కాకినాడ రూరల్, అదే నియోజకవర్గంలోని కరప మండలం నడకుదురు గ్రామంతో కలిసి సంపర వ్యవసాయ మార్కెట్ కమిటీగా ఉంది. ఉప ముఖ్యమంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేల పరిధిలో ఈ కమిటీ ఉండటంతో జిల్లాలో చాలా ప్రాధాన్యం ఉన్న కమిటీగా సంపరకు పేరుంది. అందుకు తగ్గట్టు చైర్మ¯ŒS గిరీ కోసం నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు పలువురు నేతలను ప్రతిపాదించారు. మా గతేంగాను... పార్టీలో మొదటి నుంచీ ఉన్న తమ పరిస్థితి ఏమిటని మిగిలిన సీనియర్లు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఈ చైర్మ¯ŒS గిరీని కాకినాడ రూరల్ మండలం నుంచి పుల్లా ప్రభాకరరావు, రామదేవు సీతయ్యదొర, కర్రి సత్యనారాయణలు ఆశిస్తున్నారు. వీరిలో ప్రభాకరరావు పార్టీలో సీనియర్. ఇతనికి వరుసకు కుమారుడైన పుల్లా సుధాచంద్ర రూరల్ ఎంపీపీగా ఉండటంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం రాదని వెనక్కు పెట్టారంటున్నారు. మరో సీనియర్ నాయకుడు సీతయ్యదొర. ఎన్టీఆర్æ వీరాభిమాని. ఆవిర్భావం నుంచి పార్టీ జెండా భుజాన మోసిన దొర పట్టుబడుతున్నారు. ఈ ముగ్గురులో చైర్మ¯ŒS గిరీ ఎవరిని వరిస్తుందా అని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.రూ.30 లక్షలు మింగేసి చైర్మ¯ŒS పీఠం ఇవ్వకపోగా, వైస్ చైర్మ¯ŒS పోస్టు కోసం అనపర్తి, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పోటీ నెలకొనడంతోనే చైర్మ¯ŒSగిరీ పెండింగ్‌లో ఉందని రూరల్ నేత ఒకరు బుజ్జగిస్తున్నారు. ఎవరో ఒకరికి చైర్మ¯ŒS ఇవ్వకుండా ఇంకా ఎంత కాలం ఇలా జాప్యం చేస్తారని తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఆ ప్రాతినిధ్యం మాదే కావాలి... ఆ చైర్మ¯ŒS గిరీ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో తమ నియోజకవర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ముఖ్యనేత పట్టుబడుతున్నారు. గత కాంగ్రెస్ హయాంలో పెదపూడి మండలానికి చెందిన అద్దంకి ముక్తేశ్వరరావు చైర్మ¯ŒSగా వ్యవహరించారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా కాపు సామాజిక వర్గానికే కేటాయించాలని ఆ ముఖ్యనేత ప్రతిపాదించారు. నియోజకవర్గంలో అన్నింటా తానై రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న ముఖ్య నాయకుడు చైర్మ¯ŒSగిరీ కోసం అంతగా పట్టుబట్టడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఈ చైర్మ¯ŒS పీఠానికి ముఖ్యనేత రూ.30 లక్షలుగా నిర్ణయించి మెజార్టీ సొమ్ము ఇప్పటికే జేబులో వేసుకున్నాడని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలు, చివరకు మంత్రుల పర్యటనల ఖర్చు కూడా చైర్మ¯ŒS ఆశిస్తున్న కాకినాడ రూరల్‌కు చెందిన ఒక నాయకుడే భరిస్తున్నాడు. ఆ ఖర్చుతోపాటు రెండు దఫాలు (రూ.16 లక్షలు ఒకసారి, రూ.9 లక్షలు మరోసారి) మొత్తంగా రూ.25 లక్షలు నియోజకవర్గ ముఖ్యనేతకు ముట్టజెప్పారని పార్టీలో చర్చ జరుగుతోంది. ముందుగా కుదిరిన డీల్ రూ.30 లక్షలు ప్రకారం చూస్తే పాతిక లక్షలు ఇప్పటికే ముట్టజెప్పగా, ఏడాదిన్నర ఖర్చుల కింద మిగిలిన ఐదు లక్షలు చూసుకోవాలని చైర్మ¯ŒS రేసులో ఉన్న నాయకుడు లెక్కలు చెప్పారని తెలిసింది. అన్ని లక్షలు తీసుకున్నప్పటికీ ఆ ముఖ్యనేత చైర్మ¯ŒS గిరీ ఈవేళ, రేపు అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న తీరుతో చేతి చమురు వదుల్చుకున్న నేత వర్గీయులు మండిపడుతున్నారు.