సీఎం సాక్షిగా టీడీపీ నేతల గ్రూపు రాజకీయాలు
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జేసీ సోదరులు, మంత్రి పల్లె రఘునాధరెడ్డి వర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.
సీఎం చంద్రబాబు సోమవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబుకు వర్గాలవారీగా స్వాగతాలు లభించాయి. తెలుగు తమ్ముళ్లు ఆయనకు వేర్వేరుగా స్వాగతం పలికారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన వర్గీయులు తాడిపత్రిలో తమ అధినేతకు ఆహ్వానం పలికారు.
మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, యామిని బాల, వరదాపురం సూరి తదితరుల శింగనమలలో చంద్రబాబును స్వాగతించారు. తెలుగు తమ్ముళ్ల గ్రూపు రాజకీయాలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.