
అంకుర్‌కు బహుమతి అందజేస్తున్న దృశ్యం
ఖమ్మం స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి అండర్–15 క్రికెట్ టోర్నీలో ఖమ్మంకు చెందిన క్రికెటర్ అంకుర్‌సింగ్ ఎనిమిది వికెట్లు తీసి ఆంధ్రా జట్టుపై ఘన విజయం సాధించాడు. తెలంగాణ–ఆంధ్రా జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు కేవలం 7.2 ఓవర్లు మాత్రమే ఆడి.. 21 పరుగులకే ఆలౌట్ అయింది. తెలంగాణ జట్టులో బౌలర్ అంకుర్‌సింగ్ అద్భుత ప్రతిభ చాటి 3.3 ఓవర్లలో రెండు మెడిన్ ఓవర్లు, 5 రన్స్‌కు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దీంతో తెలంగాణ జట్టుకు ఘన విజయం దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంకుర్‌సింగ్ ఎంపికయ్యాడు. గురువారం వెస్ట్ బెంగాల్ జట్టుతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు జట్టు కోచ్ రాజు ఠక్కర్ తెలిపారు.