పెట్రోల్‌ బంక్‌ వద్ద వినియోగదారుల ఆందోళన | andolana in petrol pump | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌ వద్ద వినియోగదారుల ఆందోళన

Published Sat, Sep 3 2016 9:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:45 PM

కోనరావుపేట బంక్‌లో వచ్చిన పెట్రోల్‌ - Sakshi

కోనరావుపేట బంక్‌లో వచ్చిన పెట్రోల్‌

కోనరావుపేట(కరీంనగర్‌) : మండలకేంద్రంలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద శనివారం సాయంత్రం వినియోగదారులు ఆందోళన చేపట్టారు. కల్తీ పెట్రోల్‌ విక్రయిస్తున్నారని, దీంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని ఆరోపిస్తూ తహసీల్దార్‌ గంగయ్యకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కోనరావుపేట పెట్రోల్‌ బంక్‌లో కొన్ని రోజులుగా కల్తీ పెట్రోల్‌ విక్రయాలు జరుపుతున్నారు.

ఫలితంగా పెట్రోల్‌ వినియోగించిన వారు తమ వాహనాలు త్వరగా చెడిపోతున్నాయని, మెకానిక్‌లను అడిగితే కల్తీ పెట్రోల్‌ పోయడమే కారణమని చెబుతున్నారని అన్నారు. శనివారం సాయంత్రం కోనరావుపేట, వట్టిమల్ల, కొండాపూర్, వెంకట్రావుపేట గ్రామాలకు చెందిన ఆటోడ్రైవర్లు, వాహనదారులు పెట్రోల్‌ను బాటిళ్లలో పట్టి చూడగా కింద నీరులాంటి పదార్థం ఏర్పడింది. దేవయ్య, దామోదర్, రామచంద్రం ఈ విషయమై తహసీల్దార్‌ గంగయ్యకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement