ఆణిముత్యాలు | Animutyalu | Sakshi
Sakshi News home page

ఆణిముత్యాలు

Published Mon, May 22 2017 10:50 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Animutyalu

  •  తెలంగాణ ఎంసెట్‌లో జిల్లా విద్యార్థుల విశేష ప్రతిభ
  • ఇంజినీరింగ్‌లో దిలీప్‌కుమార్‌రెడ్డికి స్టేట్‌ ఆరోర్యాంకు
  •  అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీలో స్టేట్‌ నాల్గో ర్యాంకు సాధించిన మనోజ్‌ పవన్‌రెడ్డి 
  •  
     
    జేఎన్‌టీయూ :
    తెలంగాణ ఎంసెట్‌లో జిల్లా విద్యార్థులు మెరిశారు. రాష్ట్రస్థాయిలో టాప్‌ ర్యాంకులు సాధించారు. ఎంసెట్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో తాడిపత్రి పట్టణంలోని జయనగర్‌ కాలనీకి చెందిన చాగం దిలీ‹ప్‌కుమార్‌రెడ్డి తెలంగాణ స్టేట్‌లో ఆరో ర్యాంకు , గుంతకల్లుకు చెందిన బి.రాజేష్‌  738వ ర్యాంకు సాధించారు.  అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో హిందూపురానికి చెందిన మనోజ్‌పవన్‌ రెడ్డి స్టేట్‌ నాల్గో ర్యాంకు సాధించాడు. వీరు ఏపీ ఎంసెట్‌, ఇతర పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చూపారు.
     
    అన్ని పరీక్షల్లోనూ టాపే
    తాడిపత్రిలోని జయనగర్‌ కాలనీకి చెందిన  సుజాత, చాగం రామగోవిందరెడ్డి కుమారుడు దిలీప్‌కుమార్‌రెడ్డి. రామగోవిందరెడ్డి తాడిపత్రి మండలం బోడాయిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సుజాత గృహిణి. దిలీప్‌ అన్ని పరీక్షల్లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణ ఎంసెట్‌లో 160 మార్కులకు గాను  155 మార్కులతో  స్టేట్‌ 6వర్యాంకు సాధించిన ఇతను ఇంతకుముందు ఏపీ ఎంసెట్‌ ఫలితాల్లో కూడా  137.22 మార్కులతో స్టేట్‌  56వర్యాంకు సాధించాడు.  జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో  330 మార్కులతో  ఆల్‌ ఇండియా స్థాయిలో  35వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తాడిపత్రి పట్టణంలోని చర్చి స్కూలులో, 6,7 తరగతులు అనంతపురంలోని కేశవరెడ్డి స్కూలులో, 8,9 అనంతపురం శ్రీచైతన్య స్కూలులో చదివాడు. 10వ తరగతి విజయవాడ శ్రీచైతన్య స్కూలులో చదివి పదికి పది పాయింట్లు సాధించాడు. అనంతరం  విజయవాడ శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో  ఇంటర్‌ (ఎంపీసీ ) చదివి 961మార్కులు సాధించాడు. ఎంటెక్‌ చేసి.. సమాజానికి ఉపయోగపడే  నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తానని దిలీప్‌ చెబుతున్నాడు. తన విజయాలకు కారణం తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని స్పష్టం చేశాడు.
     
    డబుల్‌ ధమాకా
      హిందూపురానికి చెందిన మనోజ్‌పవన్‌ రెడ్డి తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో మొత్తం 150 మార్కులకు గాను 95.13 మార్కులు సాధించాడు. తద్వారా స్టేట్‌ నాల్గో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇతను ఏపీ ఎంసెట్‌లోనూ స్టేట్‌ ఆరో ర్యాంకు సాధించి డబుల్‌ ధమాకా కొట్టాడు. ఇతని తల్లిదండ్రులు డాక్టర్‌ అరుణకుమారి, డాక్టర్‌ జీవీ భాస్కర్‌రెడ్డి. మనోజ్‌  పదో తరగతి హిందూపురం నారాయణ పాఠశాలలో చదివాడు. పదికి పది పాయింట్లు సాధించాడు. ఇంటర్మీడియట్‌ శ్రీచైతన్య కళాశాల(విజయవాడ)లో చదివాడు.  ‘నీట్‌’ కూడా రాశానని, అందులోనూ మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చదివి న్యూరోసర్జన్‌ కావాలన్నదే తన లక్ష్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement