
భక్తిశ్రద్ధలతో ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ట
నార్శింపల్లి (తాడిమర్రి) : మండలంలో నార్శింపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ప్రత్యేక పూజల తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో విశ్రాంత డీజీపీ జేవీ.రాములు, డీఐజీ ప్రభాకర్ రావు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.