నంద్యాలకు మరో ఎర
నంద్యాలకు మరో ఎర
Published Tue, Jul 11 2017 12:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
- పట్టణ మధ్యలో కుందూపై వంతెన నిర్మాణం..
- నదిలో పూడికతీతకు రూ.7.36 కోట్లు
కర్నూలు(సిటీ) : నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ అడ్డదారిలో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నిధులు మంజూరు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల మధ్యలో వెళ్లే కుందూ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం, నదిలో పూడికతీతకు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జలవనరుల శాఖ అధికారులు ఇటీవలే రూ.8.86 కోట్లకు అంచనాలు వేశారు. ఈ మేరకు జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల నుంచి రూ.7.36 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. కుందూ నదిలో 4.3 కిలోమీటర్ మేరకు పూడికతీత, నదికి ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపునకు ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో పాటు ఇటీవలే చామకాలువ పూడికతీత పనులకు సైతం నీరు-చెట్టు కింద రూ.3 కోట్లు మంజూరు చేశారు.
Advertisement