'కేశవరెడ్డి' డిపాజిట్ల సేకరణపై విచారణకు ఆదేశం
హైదరాబాద్: విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునే సమయంలో కేశవరెడ్డి విద్యాసంస్థలు డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. కేశవరెడ్డి విద్యాసంస్థలపై విద్యార్థుల తల్లిదండ్రులు నమోదు చేసిన కేసులు, కేశవ్ రెడ్డి అరెస్ట్ పై కర్నూలు ఎస్పీ రవికృష్ణతో గంటా ఫోన్ లో మాట్లాడారు.
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశరెడ్డిని కర్నూలు సీసీఎస్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా అప్పుల ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై అరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిందండ్రుల వద్ద రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు కేశవరెడ్డి విద్యాసంస్థ యాజమాన్యం వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.