Keshava Reddy
-
రెండున్నర దశాబ్దాలైనా.. వీడని ఎస్ఎస్సి బంధం
కరీంనగర్: ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్‌లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 26 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాల పదవ తరగతి 1996-97 పూర్వ విద్యార్థులు. తిరిగి ఒకే గూటికి చేరిన జ్ఞాపకాలు.. ప్రగతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 26 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో.. అదే తరగతి గదిలో.. అదే బెంచ్ పై కూర్చుని, వారు ఒకరినొకరు పలకరించుకుంటూ.. కలుసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి అధ్యక్షతన జ్యోతి ప్రజల్వను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి జీవితంలో సాధించిన విజయాలు, కష్టాల గురించి చర్చించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ మాట్లాడుతూ.. వారు చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ప్రధానం చేశారు. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కరీంనగర్లో స్థిరపడిన అబు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ.. వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ.. తమ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మనకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి, విద్యార్థులు అబు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, కుమార్, సురేష్, వనజ, కళాజ్యోతి, శ్రావణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
అనంతపురం: జిల్లాలో వైఎస్సార్సీపీ నేత కేశవరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఆత్మకూరుకు చెందిన కేశవరెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పథకం ప్రకారం కేశవరెడ్డిపై రాడ్లతో మూకుమ్ముడిగా దాడి చేశారు. అయితే తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మాజీ సర్పంచ్ అయిన కేశవరెడ్డిని పరిటాల కుటుంబమే హత్య చేయించిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే పరిటాల వర్గీయులు కేశవరెడ్డిని హత్య చేశారని మండిపడుతున్నారు. ఈ హత్య ఘటనలో మంత్రి సునీత సోదరడు ప్రమేయముందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేశవరెడ్డి భార్య రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'కేశవరెడ్డి' డిపాజిట్ల సేకరణపై విచారణకు ఆదేశం
హైదరాబాద్: విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునే సమయంలో కేశవరెడ్డి విద్యాసంస్థలు డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. కేశవరెడ్డి విద్యాసంస్థలపై విద్యార్థుల తల్లిదండ్రులు నమోదు చేసిన కేసులు, కేశవ్ రెడ్డి అరెస్ట్ పై కర్నూలు ఎస్పీ రవికృష్ణతో గంటా ఫోన్ లో మాట్లాడారు. కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశరెడ్డిని కర్నూలు సీసీఎస్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా అప్పుల ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై అరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిందండ్రుల వద్ద రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు కేశవరెడ్డి విద్యాసంస్థ యాజమాన్యం వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. -
క్షుద్రదేవత పీడకలకు అక్షరరూపం
కేశవరెడ్డి తన నవలల్లో సమాజం అట్టడుగు పొరలలో, దాని అంచులలో ఉన్న అణగారిన బతుకుల జీవిత చిత్రణకు అగ్రాసనం వేశారు. స్వానుభవం నుంచి వచ్చినవే ఉత్తమ రచనలనీ, అలాంటివే విశ్వసనీయంగా ఉంటాయనీ ఇటీవల వ్యాప్తిలోకి వచ్చిన భావనను కేశవరెడ్డి నవలలు పూర్వపక్షం చేశాయి. మున్నెన్నడూ తెలుగు పాఠ కలోకం చవిచూడని నవలలు రాసి, ప్రపంచ సాహిత్యం చది వినపుడు కలిగే అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చిన రచయిత డాక్టర్ కె. కేశవరెడ్డి. చిత్తూరు జిల్లా, తలుపులపల్లి అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కేశవరెడ్డి చిన్ననాడే వలసమార్గం (‘రాముడుండాడు, రాజ్యముండాది’లో బీదాబిక్కీ వలె) పట్టారు. పుదుచ్చేరిలో వైద్యశాస్త్రం చదు వుకుని, అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి చేరారు. అక్కడే విక్టోరియా మిషనరీ ఆస్పత్రిలో కుష్టు వ్యాధి నిపుణునిగా పనిచేసి, స్థిరపడ్డారు. ఒకవైపు నిత్యం కుష్టువ్యాధిగ్రస్తులకు సేవచేస్తూనే, మరోవైపు కులం అనే కుష్టువ్యాధి సోకిన తెలుగు/భారతీయ సమాజాన్ని అధ్య యనం చేశారు. ఆ సమాజంలోని వైరుధ్యాలను ఔపో శన పట్టారు. దానితో వచ్చిన ఆలోచనలను, భావాలను చిత్రికపట్టగా వచ్చినవే కేశవరెడ్డి నవలలు. వృత్తి రీత్యా కేశవరెడ్డి జీవితమంతా ఉత్తర తెలంగాణలోనే గడిచింది. అయినా, ఆయన నవలల నేపథ్యం చిత్తూరు జిల్లానే. తెలుగు నవల, కథానిక సాహిత్యం ప్రధానంగా బ్రాహ్మణీయ, విద్యాధిక, పట్టణ, పురుషాధిక్య, మధ్య తరగతి జీవితాలలోని ఈతిబాధలకు పరిమితమైన సం గతి తెలిసిందే. ఇందుకు భిన్నంగా కేశవరెడ్డి తన నవ లల్లో సమాజం అట్టడుగు పొరలలో, దాని అంచులలో ఉన్న అణగారిన బతుకుల జీవిత చిత్రణకు అగ్రాసనం వేశారు. స్వానుభవం నుంచి వచ్చినవే ఉత్తమ రచనలనీ, అలాంటివే విశ్వసనీయంగా ఉంటాయనీ ఇటీవల వ్యాప్తిలోకి వచ్చిన భావనను కేశవరెడ్డి నవలలు పూర్వపక్షం చేశాయి. ఆయన వ్యవసాయ, మధ్య తరగతి కుటుం బం నుంచి వచ్చారు. కాబట్టి అధో జగత్ సహోదరుల బతుకులలోని నీలి నీడలను స్వయంగా అనుభవించి పల వరించే అవకాశం లేదు. కానీ ఈ రచ యిత తన పంచేంద్రియాలను యాం టెన్నాలుగా మార్చుకుని ఉన్న చోట ఉంటూనే, తనకు అందనంత దూరం లో ఉన్న మాల మాదిగ, యానాది ఇత్యాది పంచముల అనుభవాలనూ, జ్ఞానాన్నీ సొంతం చేసుకోగలిగారు. దీని ఫలితంగానే ‘ఇంక్రెడి బుల్ గాడెస్’ మొదలుకొని ‘మునెమ్మ’ వరకు 8 నవలలు ఆయన కలం నుంచి జాలువారాయి. మన వ్యవస్థలో కులం పోషించే ప్రతి నాయక పాత్రను కేశవరెడ్డి ‘ఇంక్రె డిబుల్ గాడెస్’లో చిత్రించారు. ఈ నవలలన్నింటిలోను పాఠకులకు ప్రధానంగా కనిపించేది దర్శనాత్మక వాస్తవికతే. ఘర్షణ లేని వాస్తవం ఉండజాలదన్న ప్రాథమిక స్పృహ కేశవరెడ్డి సాహిత్య మంతటా విస్తరించి ఉంటుంది. ఆయన నవలా ప్రస్థా నంలో రెండు పర్యాయాలు సీక్వెల్స్ (కొనసాగింపు నవ లలు) రాయడం గమనిస్తాం. ‘ఇంక్రెడిబుల్ గాడెస్’ నవ లకు ‘స్మశానం దున్నేరు’; ‘మూగవాని పిల్లనగ్రోవి’ నవ లకు ‘చివరి గుడిసె’ అలాంటి కొనసాగింపు నవలలే. మొదటి నవలలో ఉద్భవించిన వైరుధ్యానికి రెండో నవ లలో శత్రు సంహారం ద్వారా ముగింపు పలుకుతా రాయన. మొదటి సందర్భంలో కథానాయకుని చేతిలో భూస్వామి హతమైతే, రెండో సందర్భంలో బైరాగి ఉసిగొలపడం వల్ల కుక్క భూస్వా మిని కడతేరుస్తుంది. కేశవరెడ్డి సృష్టిం చిన పాత్రలన్నీ ప్రాకృతికంగా నడుచు కున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అదే ప్రకృతి ధర్మం అన్నంత సహజంగా అవి వ్యవహరించడం విశేషం. ఆ పాత్రలను ఒక అనివార్యత, ఒక అనుల్లంఘనీయత ముందుకు తోస్తూ ఉంటాయి. చివరి నవల ‘మునెమ్మ’ లో ఇది మరింత ప్రస్ఫుటం. కథా నాయిక మునెమ్మ తన భర్తను చంపిన వారిని బొల్లెద్దుతో చంపిస్తుంది. అం టే ఆయన పాత్రలన్నీ తమ తమ కర్తవ్యాన్ని నెరవేర్చడం దగ్గర ఒక దీక్షతో, నిబద్ధతతో సాగుతూ ఉంటాయి. ఒక అమానుష, భయంకర, చీకటి కమ్మిన వాస్తవికతతో కూడిన బీభత్స వాతావరణం కేశవరెడ్డి నవలలన్నింటి లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఆయన సృష్టించిన పాత్ర లన్నీ ఒక పోరాట స్ఫూర్తితో కదలాడుతూ ఉంటాయి. ఇంతకీ ఆ పోరాట స్ఫూర్తి చుట్టూ ఉన్న పరిస్థితుల మీద తిరగబడేందుకు సంతరించుకున్నదే. ఆయన నవలలు ఇచ్చే సందేశం కూడా అదే. ఈ ఆవిష్కరణలోనే కేశవరెడ్డి కవితాత్మక న్యాయా న్ని కూడా సాధిస్తారు. హెన్రీ మిల్లర్ (సుప్రసిద్ధ అమె రికన్ నవలాకర్త) అమెరికాను ‘ఎయిర్ కండిషన్డ్ నైట్ మేర్ ’ అని అభివర్ణిస్తాడు. కేశవరెడ్డి భారతీయ సమా జాన్ని ‘క్షుద్రదేవత దుస్స్వప్నం’గా అభివర్ణించడం కూడా అలాంటిదే. (వ్యాసకర్త ప్రముఖ సాహిత్య విమర్శకులు) మొబైల్: 8790908538