'హోదా రాకున్నా.. అధిక ప్రయోజనాలు' | ap not developed with special status, says purandeswari | Sakshi
Sakshi News home page

'హోదా రాకున్నా.. అధిక ప్రయోజనాలు'

Published Sat, Aug 29 2015 9:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'హోదా రాకున్నా.. అధిక ప్రయోజనాలు' - Sakshi

'హోదా రాకున్నా.. అధిక ప్రయోజనాలు'

విజయవాడ (లబ్బీపేట) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకున్నా, హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలను అపోహలకు గురిచేయడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. విజయవాడలోని మాంటిస్సోరి ఆడిటోరియంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం సురక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పురందేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ న్యాయం చేస్తుందన్నారు. 14వ ఆర్థిక సంఘం అభ్యంతరాల వల్లే ప్రత్యేక హోదా ఇవ్వలేక పోతున్నట్లు ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement