ఖాతాదారులకు మెరుగైన సేవలు
Published Sat, Jul 16 2016 8:33 PM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM
మేడిపూర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకుమిత్ర ద్వారా సేవలు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) మేనేజర్ పత్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని మేడిపూర్‌లో నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలు ఇచ్చేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నాన్నారు. అనుకూల పనివేళల్లో డబ్బు జమచేసేందుకు ఖాతాదారులకు వీలుంటుందని విధిగా రసీదును పొందాలన్నారు.
గ్రామీణులు ఆడంబరాలకు పోకుండా ఉన్న డబ్బుతో పొదుపు పాటించాలన్నారు. స్వయం ఉపాధి పథకాలను ఎంపిక చేసుకుని బ్యాంకు నుంచి పొందిన రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. సామాజిక భద్రతతోపాటు పంటల బీమా చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కె.మల్లేష్, బ్యాంకు అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement