వైఎస్సార్‌సీపీలో జిల్లా నాయకుడికి కీలక బాధ్యతలు | appointed ysrcp cec member | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో జిల్లా నాయకుడికి కీలక బాధ్యతలు

Published Sat, Jul 30 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

appointed ysrcp cec member

కొల్లాపూర్‌ : జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు గుండ్రెడ్డి రాంభూపాల్‌రెడ్డికి అధిష్టానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈయనను పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడి (ఈసీఈ) గా నియమించారు. మొదట్నుంచీ వైఎస్సార్‌ అనుచరుడిగా కొనసాగుతున్న రాంభూపాల్‌రెడ్డి పార్టీలో ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కొల్లాపూర్‌ మండలంలోని మంచాలకట్టకు చెందిన ఈయన కడప జిల్లాలో న్యాయవాద కోర్సు ^è దువుతూ వైఎస్సార్‌కు అనుచరుడిగా మారారు. ఆయన కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకుడిగా ఎంతో కాలం కొనసాగారు. యువజన నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఈయన కొల్లాపూర్‌ గ్రంథాలయ చైర్మన్‌గా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, డీసీసీ సభ్యుడిగా పనిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా, ముంపు గ్రామాల పునర్నిర్మాణ కమిటీ వైస్‌చైర్మన్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా, కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కమిటీ సభ్యుడిగా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. 98 జీఓ అమలు కోసం పోరాడి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. వైఎస్సార్‌ మరణాంతరం జగన్‌ వెంట నడిచారు. ఈయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పార్టీ పటì ష్టానికి కృషి 
సీఈసీ సభ్యుడిగా నియమితులైన రాంభూపాల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌నుంచి ఫోన్లో మాట్లాడారు. పార్టీ పటిష్టానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ మోసపూరిత విధానాలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. విద్యార్థి, యువజన, రైతు సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాడతామని చెప్పారు. 
 
 
 

Advertisement

పోల్

Advertisement