‘అరకువేలీ కాఫీ’ పథకం పొడిగింపు | 'Arakuveli coffee' scheme extension | Sakshi
Sakshi News home page

‘అరకువేలీ కాఫీ’ పథకం పొడిగింపు

Published Thu, Aug 8 2013 2:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

'Arakuveli coffee' scheme extension

 సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతాల్లో సాగుచేస్తున్న కాఫీ నాణ్యతపరంగా శ్రేష్టమైన రకమని, ‘అరకువేలీ కాఫీ’గా అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు పొందిన ఈ కాఫీ సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఆరు వేల టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతున్నట్టు అంచనాలున్నాయని, పన్నెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ ఉత్పత్తిని బలోపేతం చేయాలని, అందుకోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాన్ని కొనసాగించాలని ప్రతిపాదించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
 
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ఫైన్ కప్’ అవార్డుల కార్యక్రమంలో అరకు లోయ కాఫీ ‘ఉత్తమ అరబికా కాఫీ అవార్డు’ను సాధించిందని కూడా పేర్కొంది. రాజ్యసభలో బుధవారం ఓ ప్రశ్నకు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి డి.పురంధేశ్వరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement