ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌తో వాగ్వాదం
-
‘సివిల్స్’ రెమ్యునరేషన్‌పై వివాదం
-
వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకుల నిరసన
కేయూక్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావుకు ఆ కళాశాల అధ్యాపకులు వా గ్వాదానికి దిగారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా కళాశాలలో సెంటర్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులకు ఇన్విజిలేట ర్లుగా విధులు కేటాయించగా.. పరీక్ష ముగిశాక సా యంత్రం రెమ్యునరేషన్ విషయమై వివాదం ప్రా రంభమైంది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సందర్భం గా ఒక్కో గదిలో పన్నెండు మందికి ఓ ఇన్విజిలేట ర్‌ను నియమించాల్సి ఉండగా ప్రిన్సిపాల్ 24మందికి అభ్యర్థులు ఉన్నా ఒక్క ఇన్విజిలేటర్‌నే నియమించారని అధ్యాపకులు విమర్శించారు. ఈ మేర కు ప్రతీ ఇన్విజిలేటర్‌కు రెట్టింపు రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రిన్సిపా ల్ రామానుజరావు సర్దిచెప్పేందుకు యత్నించినా అధ్యాపకులు వినలేదు. అధ్యాపకులతో పారదర్శకంగా, సమన్వయంగా ఉండడం లేదని.. వీసీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మధుకర్‌తో సహా ఇన్విజిలేటర్ విధులను నిర్వర్తిం చిన అధ్యాపకులు ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి ది గారు. అలాగే, ఏ విషయంలోనూ తనకు సరైన సమాచారం ఇవ్వడం లేదని వైస్ ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు.. అందరితో సమన్వయంతో వ్యవహరిస్తానని, నిబంధనల ప్రకారం సోమవారం రెమ్యునరేషన్ చెల్లిస్తానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.