
ఇండియన్ పెట్రోల్ బంక్ పై దుండగుల దాడి
చింతకుంట(కర్నూలు): జిల్లాలోని చింతకుంట సమీపంలో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ పై మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు దాడి చేశారు. ఒక్కసారిగా పెట్రోల్ బంక్ పై దాడి చేసిన దుండగులు కౌంటర్ లోని నగదును ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనలో క్యాషియర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.