మెట్‌పల్లి మున్సిఫ్ జడ్జి సంతోష్‌కుమార్
గుండంపల్లిలో న్యాయవిజ్ఞాన సదస్సు
మల్లాపూర్ (కోరుట్ల) : గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేం దుకే న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మెట్‌పల్లి మున్సిఫ్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ అన్నారు. మండలంలోని గుండంపల్లిలో ఆదివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగినపుడు పౌరులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. పేదలకు ఉచిత న్యాయ సేవలందించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో కోఆర్డినేటర్‌గా ఎలేటి రాంరెడ్డి ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సేవలందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీశ్, సర్పంచ్ భూపెల్లి దేవయ్య, ఎంపీటీసీ మార్గం హారీకప్రతాప్, మల్లాపూర్ సింగిల్ విండో చైర్మన్ ఏలేటి రాంరెడ్డి, ఉపసర్పంచ్ జక్కుల అనిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మెహన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు మగ్గిడి వెంకటనర్సయ్య, పుప్పాల భానుమూర్తి, కొండ ప్రవీణ్‌కుమార్, రాజ్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
Published Mon, Jan 30 2017 10:31 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
Advertisement