బ్యాడ్మింటన్‌ చాంపియన్లు.. తెలుగు తేజాలు | badminton winners..ap players | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ చాంపియన్లు.. తెలుగు తేజాలు

Published Sat, Aug 27 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

బాలికల డబుల్స్‌ అండర్‌ 17 విభాగం రన్నరప్‌గా నిలిచిన సామియ ఇమద్‌ ఫరూఖి, గాయత్రి గోపీచంద్‌ పుల్లెల(తెలంగాణ),

బాలికల డబుల్స్‌ అండర్‌ 17 విభాగం రన్నరప్‌గా నిలిచిన సామియ ఇమద్‌ ఫరూఖి, గాయత్రి గోపీచంద్‌ పుల్లెల(తెలంగాణ),

– డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ
– ముగిసిన ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ 
తిరుపతి సెంట్రల్‌: తిరుపతిలో  వారం రోజులుగా నిర్వహించిన ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ముగిశాయి. శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన  ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. 
           బాలురు డబుల్స్‌ అండర్‌–17 విభాగంలో సాయిపవన్‌ కర్రి (ఏపీ), శ్రీ కృష్ణసాయి కుమార్‌ పొదిలి(తెలంగాణ) తమ ప్రత్యర్థి ఖదీర్‌ మోయినుద్దీన్‌ మహహ్మద్‌(తెలంగాణ), విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ) జట్టుపై 19–21, 21–14, 21–10 సెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. సింగిల్స్‌ విభాగంలో కార్తికేయ గుల్షన్‌ కుమార్‌(ఎయిరిండియా) తన ప్రత్యర్థి మైసం మెరబా(మణిపాల్‌)పై 21–15, 19–21, 21–13 సెట్లతో గెలిచి చాంపియన్‌గా నిలిచారు. అండర్‌–19 బాలురు సింగిల్స్‌ విభాగంలో లక్ష్యసేన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) తన ప్రత్యర్థి కనిష్క్‌ (ఎయిరిండియా)పై 21–15, 21–15 వరుస సెట్ల్‌లో గెలుపొంది చాంపియన్‌గా నిలిచారు. బాలురు అండర్‌ 19 డబుల్స్‌ విభాగంలో కృష్ణప్రసాద్‌ (ఏపీ), ధృవ్‌ కపిల (పంజాబ్‌) తమ ప్రత్యర్థి  గౌస్‌ షేక్‌(ఏపీ), బషీర్‌ సయ్యద్‌ (ఏపీ) జట్టుపై 21–13, 21–12 తేడాతో గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. 
బాలికల్లో చాంపియన్‌లు
అండర్‌–17 బాలికల విభాగంలో ఆకర్షి కశ్యప్‌(చత్తీస్‌గడ్‌) తన ప్రత్యర్థి ప్రషి జోషి (ఎయిరిండియా)పై 21–19, 21–14 సెట్ల తేడాతో చాంపియన్‌గా నిలిచింది. డబుల్స్‌ విభాగంలో అశ్విని భట్‌ (కేటీకే), మిథుల (కేటీకే) తన ప్రత్యర్థి సామియా ఇమాద్‌ ఫరూఖి, గాయత్రి గోపీచంద్‌ పుల్లెల (తెలంగాణ) జట్టుపై 21–19, 21–17 సెట్లతో గెలుపొంది చాంపియన్‌గా నిలిచారు. అండర్‌ 19 బాలికల సింగిల్స్‌ విభాగంలో ఆకర్షి కశ్యప్‌ (చత్తీస్‌గడ్‌) తన ప్రత్యర్తి శిఖా గౌతమ్‌(కేటీకే)పై 17–21, 21–7, 21–13 సెట్ల తేడాతో గెలుపొందింది. డబుల్స్‌ విభాగంలో మహిమా అగర్వాల్, శిఖా గౌతమ్‌(కేటీకే) తమ ప్రత్యర్థి అశ్విని భట్‌ , మిథుల (కేటీకే)పై 18–21, 21–15, 21–17 సెట్ల తేడాతో చాంపియన్‌గా నిలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ అండర్‌ 19 విభాగంలో కృష్ణప్రసాద్‌(ఏపీ), మహిమా అగర్వాల్‌ (కేటీకే) తమ ప్రత్యర్థి ధృవ్‌ కపిల (పంజాబ్‌), కుహూ గార్గ్‌(ఉత్తర్‌ప్రదేశ్‌)పై 21–16,21–14 సెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్స్‌గా నిలిచారు.
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement