- ఇక నకిలీ సిమ్ కార్డులు చెల్లవు
- పాలకుర్తిలో నూతన విధానం అమలు
బయోమెట్రిక్‌తోనే సిమ్ యాక్టివేషన్
Published Fri, Sep 9 2016 12:49 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
పాలకుర్తి టౌన్ : వినియోగదారులు ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు ఉపయోగించకుండా కార్డుల జారీకి బయో మెట్రిక్ విధానం అమలులోకి వచ్చిందని ఎయిర్‌టెల్ ప్రతినిధి శంకర్ లిక్కి తెలిపారు. గురువారం పాలకుర్తిలో బయో మెట్రిక్ విధానంతో సిమ్ కార్డుల జారీ కార్యక్రమాన్ని పాలకుర్తి ఎస్సై ఎన్. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ లిక్కి మాట్లాడుతూ.. గతంలో ఐడీకార్డు, ఫొటో ఉంటే సిమ్‌కార్డు పొందటం తేలికయ్యేదని. దీంతో ఇతరుల పేరిట సిమ్ కార్డులు విచ్చలవిడిగా వినియోగిస్తుండడంతో అసాంఘికక శక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అందుకే బమోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు వివరించారు. వినియోగదారుడు వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ అందజేయాలని, బయోమెట్రిక్ మిషన్ ద్వారా వేలిముద్ర స్వీకరించిన ఐదు నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్‌టెల్ డిస్ట్రిబ్యూటర్ పగడాల శ్రీ««దlర్, తమ్మి రాంబాబు, బొగ్గరాపు నాగరాజు, వంగ మహేందర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement