పట్టుడు కర్రలు స్వాధీనం
Published Sat, Mar 4 2017 12:48 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
నూనెపల్లె: నంద్యాల నుంచి నెల్లూరుకు ఆర్‌టీసీ బస్సులో పట్టుడు కర్రలు తరలిస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో నంద్యాల నుంచి పట్టుడు కర్రలు బస్సులో తరలించేందుకు నిందితుడు ఆర్టీసీ డ్రైవర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు నెల్లూరు డిపోకు చెందిన బస్సు డిక్కీలో కర్రలు లోడ్ చేశారు. సమాచారం అందుకున్న డీఆర్‌ఓ సౌందర్ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది రైల్వేస్టేషన్ సమీపంలోని మూలసాగరం గేటు వద్ద బస్సును తనిఖీ చేశారు. 11 మోపుల పట్టుడు కర్రలను స్వాధీనం చేసుకుని, బస్సును ఫారెస్టు కార్యాలయానికి తరలించారు. ప్రయాణికులకు మరో బస్సు ఏర్పాటు చేశారు. స్వాధీనం చేసుకున్న కర్రల విలువ సుమారు రూ. 7వేలు ఉంటుందని డీఆర్‌ఓ సౌందర్ రాజు తెలిపారు. బస్సులో అటవీ సంపదను తరలించేందుకు ఒప్పుకున్న డ్రైవర్ దశరథుడు, నిందితుడు రమణపై కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో చలమ రేంజర్ సూర్యచంద్రరావు, మొబైల్ ఫారెస్టుర్ కిశోర్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
Advertisement