బంతిపూల ‘సిరులు’ | banthi flower sales high | Sakshi
Sakshi News home page

బంతిపూల ‘సిరులు’

Published Sun, Oct 9 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

బంతిపూల ‘సిరులు’

బంతిపూల ‘సిరులు’

బంతి పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. వరుస పండుగల నేపథ్యంలో డిమాండ్‌ పెరగడంతో ధరలు భారీగా పలుకుతున్నాయి. డీ.హీరేహాళ్‌ మండలం బాదనహాళ్‌ సమీపంలో రైతు బసవరాజు ఎకరా విస్తీర్ణంలో పూలు విరగకాశాయి. కోతకు 250 కిలోల నుంచి 300 కిలోల వరకు పూలదిగుబడి వస్తోంది. గత వినాయక చవితి నుంచి ఇప్పటిదాకా 15 కోతలు కోసినట్లు రైతు తెలిపాడు. గతంలో కిలో రూ.30 ప్రకారం అమ్ముడుపోయాయని, ప్రస్తుతం పొలంవద్దకే వచ్చి కిలో రూ.70కు కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు. ఇప్పటిదాకా ఖర్చులుపోను లక్షరూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు వివరించాడు. దీపావళి వరకు పూలకు డిమాండ్‌ ఉంటుందని, మరో రూ.1.50 లక్షల వరకు ఆదాయం రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement