హోరాహోరీగా బాస్కెట్‌బాల్ పోటీలు
హోరాహోరీగా బాస్కెట్‌బాల్ పోటీలు
Published Sun, Aug 28 2016 9:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
మార్టేరు (పెనుమంట్ర): మార్టేరు వేణుగోపాలస్వామి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, మార్టేరు, యానాం జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మార్టేరు–యానాం జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది.
పోటీల వివరాలు
తాడేపల్లిగూడెం జట్టుపై మార్టేరు, నరసాపురం జట్టుపై ఏలూరు, మార్టేరు (బి)జట్టుపై భీమవరం జట్టు విజయం సాధించాయి. రాత్రి జరిగిన పోటీల్లో ఏలూరు బాలికల జట్టుపై మార్టేరు బాలికల జట్టు 10–30 తేడాతో ఘన విజయం సాధించింది.
ఉత్సాహపరిచిన మాజీ క్రీడాకారులు
అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్‌రెడ్డి క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహించారు.అప్పలరాజు, జానీ, రామకృష్ణ తదితర క్రీడాకారులకు, న్యాయ నిర్ణేతలకు సూచనలు చేశారు. అలాగే పెద్దసంఖ్యలో విచ్చేసిన మాజీ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాస్ఫూర్తిని రగిలించారు. వైద్యులు జీఎల్ రాజశేఖర్, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు అల్లం బులిరెడ్డి, మార్టేరు మర్చంట్స్ అండ్ చాంబర్ అధ్యక్షుడు కొకొల్లు లక్ష్మణరావు, మండల భాజపా అధ్యక్షుడు కొవ్వూరి రామకష్ణారెడ్డి, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement