marteru
-
సొంతూరు పీలేరు.. ఓటున్నది మార్టేరు
పెనుమంట్ర: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓటే మారిపోయింది. ఆయనది చిత్తూరు జిల్లా పిలేరు నియోజకవర్గం.. అయితే పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం మార్టేరులో ఓటు ఉన్నట్టు నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓటు కూడా మార్టేరులో ప్రత్యక్షమైంది. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికులు అధికారులను ప్రశ్నించారు. వీఆర్వో జి.దుర్గాప్రసాద్ వివరణ ఇస్తూ.. రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని గుర్తించామని, వెబ్సైట్ పనిచేయకపోవడం వల్లే బొత్స, కిరణ్‌కుమార్ పేర్లను జాబితాలో నుంచి తొలగించలేకపోయామని తెలిపారు. కాగా, ఓటర్ల జాబితాలో ఇటీవల వింతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆయన భార్య, ఇద్దరి కుమార్తెల ఓటును జాబితా నుంచి తొలగించారు. -
యాంత్రీకరణతో సాగు బాగు
- మార్టేరు వరిపరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ కరప (కాకినాడరూరల్): సాగు ఖర్చు తగ్గించి, అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని మార్టేరు వరి పరిశోధనా కేంద్రం డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. కరప మండలం నడకుదురులోని ఏరువాక కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లా సమన్వయ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులకు కొత్త వరి వంగడాలు అందించేందుకు మార్టేరు వరి పరిశోధనా కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారని తెలిపారు. యాంత్రీకరణతో, వెదజల్లులోని యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా ఖర్చు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని ఏరువాక కేంద్రం ప్రదర్శనా క్షేత్రాల ద్వారా రైతులకు తెలియచెప్పాలని సూచించారు. కోత, నాటే యంత్రాల వినియోగాన్ని కూడా రైతులు అలవాటు చేసుకోవాలని చెప్పారు. లాభసాటికాని పంటలను గుర్తించి వాటికి ప్రత్యామ్నాయంగా ఏమిచేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందో మార్టేరు శాస్త్రవేత్తలతో చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. వివిధ పంటల సాగులో అనుసరిస్తున్న పద్ధతులు రైతులను అడిగితెలుసుకుని, ఏమి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న దానిపై సమీక్షించారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీఎల్ఆర్జే ప్రవీణ, గతయేడాది అమలు చేసిన వివిధ పథకాలు, పరిశోధనలు, వచ్చేయేడాది అమలుచేసే కార్యాచరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతయేడాది ఉత్తమ ఏరువాక కేంద్రం అవార్డు వచ్చినందుకు డాక్టర్ ప్రవీణను డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అభినందించారు. వి«విధ శాఖల అధికారులు మాట్లాడుతూ రైతులు ప్రయోజనం పొందాలంటే తమ శాఖల ద్వారా అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. నాబార్డు ఏజీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కేవీఎస్ ప్రసాద్, ఉద్యాన శాఖ ఏడీ కె.గోపికుమార్, ఏపీఎంఐపీ పీడీ టీవీ సుబ్బారావు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ వీటీ రామారావు, మార్టేరు వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ జే కృష్ణప్రసాద్ (తెగుళ్ల విభాగం), డాక్టర్ ఎన్.చాముండేశ్వరి(బ్రీడింగ్), డాక్టర్ పి.ఆనంద్‌కుమార్(సస్యరక్షణ), డాక్టర్ ఎం.శ్రీనివాస్(ఆగ్రానమీ), ఏరువాక కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.నందకిశోర్, డాక్టర్ సి.వెంకటరెడ్డి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహాసంఘం సభ్యుడు చుండ్రు వీరవెంకట వరప్రసాద్ పాల్గొన్నారు. -
స్వర్ణకు సలామ్
పెనుమంట్ర (ఆచంట): పెనుమంట్ర మండలం మార్టేరులో రూపుదిద్దుకుని రైతులకు సిరులు కురిపిస్తున్న స్వర్ణ రకం వరి వంగడం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార భద్రతకు దోహదపడిన వరి వంగడాలపై ఇటీవల ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 1980 దశకం ముందు నుంచి అధిక దిగుబడిని, రైతులకు పంట భరోసాను ఇచ్చిన మార్టేరు స్వర్ణ రకం కేంద్ర ప్రభుత్వ అధికారుల లెక్కల్లో అగ్రగామిగా నిలిచింది. మొత్తంగా 1980కి ముందు నుంచి రైతునేస్తాలుగా గుర్తింపు పొందిన 51 రకాల విత్తనాలను జాతీయ స్థాయిలో ప్రముఖమైనవిగా అధికారులు గుర్తించారు. వీటిలో వరికి సంబం«ధించి స్వర్ణతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలోనే రూపుదిద్దుకున్న ‘మసూరి’ వంగడం కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ జాబితాలో మొక్కజొన్నలో డీహెచ్ఎం 101 రకం కూడా ఉంది. ల్యాండ్‌మార్కు రకంగా.. న్యూఢిల్లీలో 1941లో ఏర్పాౖటెన బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ సంస్థ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ప్రముఖ విత్తన రకాలపై పరిశోధన చేస్తోంది. సంస్థను నెలకొల్పి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ, మసూరి రకాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ‘ల్యాండ్‌మార్కు’ రకాలుగా బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ గుర్తించింది. ఢిల్లీలో అవార్డు ప్రధానం జాతీయస్థాయిలో స్వర్ణ రకం గుర్తింపు పొందిన క్రమంలో మార్టేరు వరిపరిశోధనా స్థానంకు పురస్కారం దక్కింది. ఢిలీల్లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్ఎస్ పరోడ, డాక్టర్ గురుగోవింద్ కుష్, డాక్టర్ పీఎల్ గౌతమ్, డాక్టర్ జీఎస్ సంధు, డాక్టర్ వీఎల్ చోప్రా చేతుల మీదుగా మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ పురస్కారం అందుకున్నారు. మా సంస్థకు గర్వకారణం దేశంతో పాటు విదేశాల్లోనూ స్వర్ణ రకం సాగులో ఉండటం మా సంస్థకు గర్వకారణం. మార్టేరులో ఈ రకాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలకు ప్రజలు, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి స్ఫూర్తితో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను, పెట్టుబడి తగ్గించి చేయగల విత్తనాలను, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణమైన వంగడాల తయారీకి శాస్త్రవేత్తలతో కలిసి నిరంతరం కృషి చేస్తున్నాం. – డాక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్, మార్టేరు -
శుభలేఖలిచ్చి వస్తూ.. పెళ్లికొడుకు దుర్మరణం
మార్టేరు, (పెనుమంట్ర) : శుభలేఖలిచ్చి వస్తూ.. ఓ కొత్త పెళ్లికొడుకు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం రాత్రి మార్టేరు గ్రామ శివారున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..మార్టేరుకు చెందిన చీమకుర్తి నూక రత్నకుమారి పెద్ద కుమారుడు పూర్ణ వెంకట రామరాజు(27) పెళ్లి ఫిబ్రవరి 1న జరగనుంది. దీంతో ఆమె రామరాజుతో కలిసి శుభలేఖలు ఇచ్చేందుకు ద్విచక్రవాహనంపై ఆచంట వెళ్లి తిరిగి వస్తుండగా మార్టేరు శివారున ఎదురుగా వస్తున్న మరో మోటారు సైకిల్ బలంగా ఢీకొట్టింది. దీంతో రామరాజు అక్కడికక్కడే మరణించాడు. రత్నకుమారితోపాటు, మరో మోటార్‌సైకిల్‌పై ఉన్న కర్రి ప్రతాప్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రత్నకుమారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రామరాజు తమ్ముడు శివ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు. రామరాజు మోటార్‌సైకిల్ ఢీకొన్న మరో బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వీరిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరి యువకుల జాడ తెలియాల్సి ఉంది. ప్రతాప్‌ను కూడా మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం తరలించినట్టు సమాచారం. మృతుడు రాజు కొన్నాళ్లపాటు దుబాయ్‌లో ఉండి వచ్చాడు. అతని తల్లి రత్నకుమారి మార్టేరులో కిరాణాషాపు నడుపుతున్నారు. -
వరి పరిశోధన సంస్థను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
మార్టేరు (పోడూరు) : మార్టేరులోని భారతీయ వరిపరిశోధన సంస్థ వాతావరణ మార్పులకు అనుగుణంగా నిర్వహిస్తున్న ప్రయోగాలు రైతుల మన్ననలు అందుకుంటున్నాయని హైదరాబాద్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రశంసించారు. ఆ శాస్త్రవేత్తల బృందం గురువారం మార్టేరులోని వరి పరిశోధన సంస్థలో నిర్వహిస్తున్న ప్రయోగాలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ బృందంలోని పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇక్కడి పరిశోధనలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. ఇక్కడ రూపొందుతున్న వివిధ రకాల వంగడాలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ ఇక్కడ గతంలో నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రయోగాల గురించి, ఇక్కడ రూపొందించిన వంగడాల గురించి హైదరాబాద్ శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. వరి రకాల రూపకల్పన విభాగం, చీడపీడల విభాగం, మృత్తికా శాస్త్ర విభాగం, వృక్ష శరీర ధర్మ శాస్త్ర విభాగాల్లో జరుగుతున్న ప్రయోగాలను బృందం పరిశీలించింది. ప్లాంట్ బ్రీడింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.పద్మావతి, సాయిల్‌సైన్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.బి.ప్రసాద్‌బాబు, డాక్టర్ ఎన్.సోమశేఖర్(నెమటాలజీ), డాక్టర్ సంజీవరావు(బయోకెమిస్ట్రీ), డాక్టర్ కె.కళ్యాణి(బయోటెక్నాలజీ),డాక్టర్ ఎం.గిరిజారాణి(ప్లాంట్ బ్రీడింగ్) వరిపరిశోధన సంస్థలో నిర్వహిస్తున్న ప్రయోగాలను సందర్శించిన వారిలో ఉన్నారు. -
హోరాహోరీగా బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు (పెనుమంట్ర): మార్టేరు వేణుగోపాలస్వామి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, మార్టేరు, యానాం జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మార్టేరు–యానాం జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. పోటీల వివరాలు తాడేపల్లిగూడెం జట్టుపై మార్టేరు, నరసాపురం జట్టుపై ఏలూరు, మార్టేరు (బి)జట్టుపై భీమవరం జట్టు విజయం సాధించాయి. రాత్రి జరిగిన పోటీల్లో ఏలూరు బాలికల జట్టుపై మార్టేరు బాలికల జట్టు 10–30 తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్సాహపరిచిన మాజీ క్రీడాకారులు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్‌రెడ్డి క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహించారు.అప్పలరాజు, జానీ, రామకృష్ణ తదితర క్రీడాకారులకు, న్యాయ నిర్ణేతలకు సూచనలు చేశారు. అలాగే పెద్దసంఖ్యలో విచ్చేసిన మాజీ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాస్ఫూర్తిని రగిలించారు. వైద్యులు జీఎల్ రాజశేఖర్, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు అల్లం బులిరెడ్డి, మార్టేరు మర్చంట్స్ అండ్ చాంబర్ అధ్యక్షుడు కొకొల్లు లక్ష్మణరావు, మండల భాజపా అధ్యక్షుడు కొవ్వూరి రామకష్ణారెడ్డి, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. -
వరించిన పురస్కారం
-ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధన సంస్థకు జాతీయ గుర్తింపు - ఉత్తమ పరిశోధన సంస్థ అవార్డు ప్రదానం - నలుగురు విశ్రాంత శాస్త్రవేత్తలకు ఉత్తమ అవార్డులు మార్టేరు(పెనుగొండ రూరల్) :మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధన సంస్థ మరో మైలురాయిని దాటింది. జాతీయ స్థాయిలో పరిశోధనలకు సాంకేతిక పరిజ్ఞాన ం అందించడం, వరి వంగడాల రూపకల్పనకు ఉత్తమ పరిశోధన సంస్థ అవార్డును సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన 20 మంది శాస్త్రవేత్తల్లో నలుగురు శాస్త్రవేత్తలు మార్టేరుకు చెందిన వారే కావడం మరో విశేషం. ఈ అవార్డులను ఆల్ ఇండియా కో ఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (ఏఐసీఆర్‌ఐపీ) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 12న జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నట్లు మార్టేరు వరి పరిశోధన సంస్థ డైరక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో భారత దేశంలోని 46 వరి పరిశోధన సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. 1942లో బెంగాల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంచేందుకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సీఆర్ఆర్ఐని స్థాపించి పరిశోధనలు ముమ్మరం చేసిందన్నారు. ఈ పరిశోధనలను సమన్వయపరిచేందుకు 1965లో ఏఐసీఆర్‌ఐపీ స్థాపించారన్నారు. ప్రాజెక్టును ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తమ పరిశోధన సంస్థ అవార్డును ప్రకటించారని చెప్పారు. అవార్డును భారతీయ వరి పరిశోధన సంస్థ డైరక్టర్ జనరల్ ఆఫ్ రీసెర్చి డాక్టర్ ఎస్.అయ్యప్పన్, డీడీజీ డాక్టర్ సంధు నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ అల్లూరి పద్మరాజు, విశ్రాంత శాస్త్రవేత్తలతో కలసి అందుకున్నట్లు వివరించారు. నలుగురు విశ్రాంత శాస్త్రవేత్తలకు అవార్డు ఉత్తమ అవార్డుతో పాటు ఉత్తమ పరిశోధనలకు విశ్రాంత శాస్త్రవేత్తలుగా డాక్టర్ పి.శంకర్రావు, డాక్టర్ పీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ జి.వెంకట్రావు, డాక్టర్ పి.రామ్మోహనరావులు అందుకున్నట్లు చెప్పారు. దేశంలోని ఆహార ఉత్పత్తుల్లో 25 శాతం దిగుబడులు మార్టేరు వరి పరిశోధన సంస్థ రూపొందించిన వరి వంగడాల ద్వారా రావడమే అవార్డుకు ప్రధాన కారణమన్నారు. మార్టేరు నుంచి 35 ఏళ్ల క్రితం రూపొందించిన స్వర్ణ వరి వంగడం ప్రస్తుతం దేశంలో కోటీ 65 లక్షల ఎకరాల్లో సాగవుతోందని చెప్పారు. 1925లో స్థాపించిన వరి పరిశోధన సంస్థ నుంచి ఇప్పటి వరకూ 45 రకాల వరి వంగడాలకు రూపకల్పన చేశారని తెలిపారు. వరితో పాటు వాణిజ్య పంటలపైనా మార్టేరులో విస్తృత పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు