బాస్కెట్‌ బాల్‌ జిల్లా యూత్‌ జట్లు ఇవే | basket ball teams selected | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌ బాల్‌ జిల్లా యూత్‌ జట్లు ఇవే

Published Fri, Oct 21 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

బాస్కెట్‌ బాల్‌ జిల్లా యూత్‌ జట్లు ఇవే

బాస్కెట్‌ బాల్‌ జిల్లా యూత్‌ జట్లు ఇవే

నూజివీడు :  బాస్కెట్‌ బాల్‌ కృష్ణా జిల్లా యూత్‌ జట్లను పట్టణంలోని ధర్మ అప్పారావు కళాశాలలో నిర్వహించిన సెలక్షన్‌లో ఎంపిక చేశారు. బాలుర విభాగంలో 105 మంది, బాలికల విభాగంలో 36 మంది పాల్గొనగా వారి నుంచి బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో జరిగే ఒకటో అంతర్‌జిల్లా రాష్ట్రస్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో పాల్గొం టాయి. ఈ ఎంపికలో బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ సభ్యులు టీవీ కృష్ణారావు, జి.రామచంద్రరావు, ఎస్‌.రామ్మోహన్‌రావు, జి.ప్రేమ్‌కుమార్, ఎండీ అంజాద్‌అలీ  పాల్గొన్నారు.
బాలుర జట్టు
నూజివీడుకు చెందిన సీహెచ్‌ వేణుమోహన్, షేక్‌ అబ్దుల్‌నజీర్, పి.సందీప్‌కుమార్, జి.రామ్‌గోపాల్, కె.శ్యామ్‌సుందర్, గుడివాడ నుంచి ఎం.పవన్‌కుమార్, డి. ఆకాష్, విజయవాడ నుంచి డి.గురుదత్తా, జె.ఆకాష్, జె.ప్రశాంత్, గౌతమ్, కె.అశ్విన్‌రెడ్డి ఎంపికయ్యారు.
బాలికల జట్టు
నూజివీడు నుంచి వాకా సాత్విక, ఎం.హిమబిందు, వి.తేజస్విని, ఆర్‌.శ్వేత, డి.వినీల, ఆర్‌.సంధ్య, టి.లహరి, ఎస్‌వీకే కీర్తి, అర్ఫాఫరోజ్, విజయవాడ నుంచి ఆర్‌.అనూహ్య, థెరిస్సా, గుడివాడ నుంచి ఒ.సఖీ ఎంపికయ్యారు. వీరిని జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బొబ్బిలి కొండలరావు అభినందించారు. ఈ రెండు జట్లకు ఈ నెల 22వ తేదీ నుంచి డీఏఆర్‌ కళాశాలలో నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement