మిస్ ప్లానెట్ సందడి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ బతుకు పండుగ ‘బతుకమ్మ’ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జాహ్నవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ.. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వేడుకల్లో మిస్ ప్లానెట్ ఇండియా రష్మీ ఠాగూర్ పాల్గొని బతుకమ్మ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో జాహ్నవి విద్యాసంస్థల చైర్మన్ ఎ.పరమేశ్వర్, కార్పొరేటర్లు వి.శ్రీనివాస్‌రెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.