నాణ్యతలో నెంబర్‌వన్ భారతీ సిమెంటు
నాణ్యతలో నెంబర్‌వన్ భారతీ సిమెంటు
Published Sat, Dec 24 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
- జిల్లా మేనేజర్ విజయభాస్కర్
- చర్చిలకు క్రిస్మస్ కేక్‌లు పంపిణీ
కర్నూలు(టౌన్): నాణ్యతలో నెంబర్‌వన్‌గా నిలిచిన భారతీ సిమెంటు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందని జిల్లా మేనేజర్ విజయభాస్కర్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శనివారం రాత్రి భారతీ సిమెంట్ కంపెనీ తరఫున నగరంలోని అన్ని చర్చిలకు భారీకేక్‌లను పంపిణీ చేశారు. స్థానిక నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఉన్న సెయింట్ లూర్డ్సు క్యాథడ్రల్ చర్చి, సీఎస్‌ఐ చర్చి, కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చి, స్టాంటన్ మెమోరియల్ చర్చి తదితర వాటికి వెళ్లి 10 కేజీల కేక్‌లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నో సిమెంటు కంపెనీలున్నా.. మూడు రెట్లు మెరుగైన సిమెంట్ అందించడం భారతీ సిమెంటుకే సాధ్యమన్నారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వంద శాతం క్వాలిటీని అందిస్తున్నట్లు తెలిపారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మార్కెట్‌లో కల్తీకి అవకాశం లేకుండా ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో నాణ్యమైన సిమెంట్‌ను అందిస్తుందన్నారు. కడప జిల్లా నల్ల లిగాయపల్లె గ్రామంలో 5 మిలియన్ టన్నుల సిమెంట్, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బార్గా జిల్లా చాప్రాశాల గ్రామంలో 5.50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఆనంద్ పాల్గొన్నారు.
Advertisement