Bharati Cement
-
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
-
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి భారతి సిమెంట్ సంస్థకు మరో గౌరవం దక్కింది. తాజాగా ఫైవ్ స్టార్ రేటింగ్ జాతీయ అవార్డు ప్రకటించింది కేంద్రం. గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ భారతి సిమెంట్‌కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2021-22 గనుల నిర్వహణలో 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది వెయ్యికి పైగా గనులు పోటీ పడగా.. అందులో ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకున్నవి కేవలం 40 మాత్రమే కావడం విశేషం. -
నాణ్యతలో నెంబర్‌వన్ భారతీ సిమెంటు
- జిల్లా మేనేజర్ విజయభాస్కర్ - చర్చిలకు క్రిస్మస్ కేక్‌లు పంపిణీ కర్నూలు(టౌన్): నాణ్యతలో నెంబర్‌వన్‌గా నిలిచిన భారతీ సిమెంటు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందని జిల్లా మేనేజర్ విజయభాస్కర్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శనివారం రాత్రి భారతీ సిమెంట్ కంపెనీ తరఫున నగరంలోని అన్ని చర్చిలకు భారీకేక్లను పంపిణీ చేశారు. స్థానిక నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఉన్న సెయింట్ లూర్డ్సు క్యాథడ్రల్ చర్చి, సీఎస్ఐ చర్చి, కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చి, స్టాంటన్ మెమోరియల్ చర్చి తదితర వాటికి వెళ్లి 10 కేజీల కేక్‌లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నో సిమెంటు కంపెనీలున్నా.. మూడు రెట్లు మెరుగైన సిమెంట్ అందించడం భారతీ సిమెంటుకే సాధ్యమన్నారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వంద శాతం క్వాలిటీని అందిస్తున్నట్లు తెలిపారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మార్కెట్లో కల్తీకి అవకాశం లేకుండా ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో నాణ్యమైన సిమెంట్‌ను అందిస్తుందన్నారు. కడప జిల్లా నల్ల లిగాయపల్లె గ్రామంలో 5 మిలియన్ టన్నుల సిమెంట్, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బార్గా జిల్లా చాప్రాశాల గ్రామంలో 5.50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఆనంద్ పాల్గొన్నారు. -
నమ్మకం, నాణ్యతకు మారుపేరు.. భారతి సిమెంట్
డోర్నకల్ : నిర్మాణాల్లో నమ్మకం, నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్ అని సిమెంట్ జిల్లా సేల్స్ మేనేజర్ నాగేశ్వర్రావు తెలిపారు. స్థానిక జైన్ భవన్లో శనివారం ని ర్మాణాలు, సిమెంట్ వాడకంపై తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ద్వారా జర్మనీ టెక్నాలజీతో భారతి సిమెంట్ తయారవుతుందన్నారు. ఇంజనీర్లు అందిస్తున్న ప్రోత్సాహం, తాపీమేస్త్రీల సహకారంతో భారతి సిమెంట్ వినియోగదారులకు చేరువవుతోందని పేర్కొన్నారు. తాపీమేస్త్రీల సంక్షేమానికి రూ. ల క్ష బీమా సౌకర్యం కల్పిస్తూ మేస్త్రీల పేరున ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ టెక్నీషియన్ సంతోష్‌కుమార్‌తో పాటు డీలర్లు నారాయణరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్
తొర్రూరు: ఎంతో నాణ్యమైన భారతి సిమెంట్‌ను నిర్మాణదారులు వినియోగించాలని భారతి సిమెంట్ కంపెనీ టెక్నికల్ రిజినల్ మేనేజర్ ఎం.మారుతికుమార్ సూచించారు. వరంగల్ జిల్లా తొర్రూరులో భారతి సిమెంట్ కంపెనీవారి ఆధ్వర్యంలో మంగళవారం వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతికుమార్ మాట్లాడుతూ రోజురోజుకు మార్కెట్లో వినియోగదారుల నుంచి ఎంతో ఆదరణ పెరుగుతోందన్నారు. ఇతర కంపెనీల కంటే భారతి సిమెంట్ కంపెనీలో అత్యాధునికమైన, నాణ్యమైన పరిమాణాలతో సిమెంట్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు.భారతదేశంలోనే తొలిసారిగా కొత్త జర్మనీ టెక్నాలజీతో కూడిన ఈ విధానం కొనసాగుతుందన్నారు. సమావేశంలో ఏరియా సేల్స్ మేనేజర్ వి. నాగేశ్వర్రావు, స్థానిక డీలర్లు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రంజిత్‌రెడ్డితోపాటు సుమారు 50 మంది వినియోగదారులు పాల్గొన్నారు. తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు వర్ధన్నపేట మండల కేంద్రంలో మహేశ్వరి ఏజెన్సీస్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ తాపీ మేస్త్రీలకు మంగళవారం స్థానిక అరబిందో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం సామాజిక సేవలో భాగంగా 70 మంది తాపీ మేస్త్రీలకు యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్సు ద్వారా రూ. లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరీ ఏజెన్సీస్ యజమాని కర్ర శ్రీనివాసరెడ్డి, తాపీమేస్త్రీలు మర్రిపడగల పుల్లయ్య, భూమ వెంకటేశ్వర్లు, కొండేటి ఉపేందర్, భూమ రమేష్, కొండేటి బాబు, ఐత కొమురయ్య, సమ్మయ్యతోపాటు తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు. -
నాణ్యతవల్లే భారతి సిమెంటు అగ్రస్థానం
కడప : అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడంవల్లే దక్షిణ భారత దేశంలో భారతి సిమెంటు అగ్రగామిగా నిలుస్తోందని ఆ కంపెనీ మార్కెటింగ్ జనర ల్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి తెలిపారు. ఇంజనీర్లను మంగళవారం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు ఫ్యాక్టరీ సందర్శనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిమెంటు తయారీ, నాణ్యత గూర్చి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు సిబ్బంది ఇంజనీర్లకు వివరించారు. అనంతరం నిర్వహించిన ఇంజనీర్స్ మీట్లో మల్లారెడ్డి మాట్లాడుతూ ఏ ఇంజనీర్లయినా ప్రథమంగా ఎంపిక చేసేది భారతి సిమెంటునేనన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే ఇది మూడురెట్లు నాణ్యమైనది, పటిష్టమైనదన్నారు. ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ వల్ల వినియోగదారుడికి నష్టం కలగదన్నారు. ఈ కారణాల వల్లే మార్కెట్లో ముందువరుసలో ఉంటోందన్నారు.