నాణ్యతవల్లే భారతి సిమెంటు అగ్రస్థానం | bharati cement in top position due to the quality | Sakshi
Sakshi News home page

నాణ్యతవల్లే భారతి సిమెంటు అగ్రస్థానం

Published Wed, Jun 11 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

నాణ్యతవల్లే భారతి సిమెంటు అగ్రస్థానం

నాణ్యతవల్లే భారతి సిమెంటు అగ్రస్థానం

 కడప : అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడంవల్లే దక్షిణ భారత దేశంలో భారతి సిమెంటు అగ్రగామిగా నిలుస్తోందని ఆ కంపెనీ మార్కెటింగ్ జనర ల్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి తెలిపారు. ఇంజనీర్లను మంగళవారం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు ఫ్యాక్టరీ సందర్శనకు  తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిమెంటు తయారీ, నాణ్యత గూర్చి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంటు సిబ్బంది ఇంజనీర్లకు వివరించారు.
 
అనంతరం నిర్వహించిన ఇంజనీర్స్ మీట్‌లో మల్లారెడ్డి మాట్లాడుతూ ఏ ఇంజనీర్లయినా ప్రథమంగా ఎంపిక చేసేది భారతి సిమెంటునేనన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే ఇది మూడురెట్లు నాణ్యమైనది, పటిష్టమైనదన్నారు. ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ వల్ల వినియోగదారుడికి నష్టం కలగదన్నారు. ఈ  కారణాల వల్లే మార్కెట్‌లో ముందువరుసలో ఉంటోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement