నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్ | bharati cement is said to be quality cement | Sakshi
Sakshi News home page

నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్

Published Wed, Feb 11 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

bharati cement is said to be quality cement

తొర్రూరు: ఎంతో నాణ్యమైన భారతి సిమెంట్‌ను నిర్మాణదారులు వినియోగించాలని భారతి సిమెంట్ కంపెనీ టెక్నికల్ రిజినల్ మేనేజర్ ఎం.మారుతికుమార్ సూచించారు. వరంగల్ జిల్లా తొర్రూరులో భారతి సిమెంట్ కంపెనీవారి ఆధ్వర్యంలో మంగళవారం వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతికుమార్ మాట్లాడుతూ రోజురోజుకు మార్కెట్‌లో వినియోగదారుల నుంచి ఎంతో ఆదరణ పెరుగుతోందన్నారు.

ఇతర కంపెనీల కంటే భారతి సిమెంట్ కంపెనీలో అత్యాధునికమైన, నాణ్యమైన పరిమాణాలతో సిమెంట్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు.భారతదేశంలోనే తొలిసారిగా కొత్త జర్మనీ టెక్నాలజీతో కూడిన ఈ విధానం కొనసాగుతుందన్నారు. సమావేశంలో ఏరియా సేల్స్ మేనేజర్ వి. నాగేశ్వర్‌రావు, స్థానిక డీలర్లు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రంజిత్‌రెడ్డితోపాటు సుమారు 50 మంది వినియోగదారులు పాల్గొన్నారు.  

తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు
వర్ధన్నపేట మండల కేంద్రంలో మహేశ్వరి ఏజెన్సీస్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ తాపీ మేస్త్రీలకు మంగళవారం స్థానిక అరబిందో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం సామాజిక సేవలో భాగంగా 70 మంది తాపీ మేస్త్రీలకు యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్సు ద్వారా రూ. లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరీ ఏజెన్సీస్ యజమాని కర్ర శ్రీనివాసరెడ్డి, తాపీమేస్త్రీలు మర్రిపడగల పుల్లయ్య, భూమ వెంకటేశ్వర్లు, కొండేటి ఉపేందర్, భూమ రమేష్, కొండేటి బాబు, ఐత కొమురయ్య, సమ్మయ్యతోపాటు తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement