నమ్మకం, నాణ్యతకు మారుపేరు.. భారతి సిమెంట్
Published Sun, Jul 24 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
డోర్నకల్ : నిర్మాణాల్లో నమ్మకం, నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్ అని సిమెంట్ జిల్లా సేల్స్ మేనేజర్ నాగేశ్వర్‌రావు తెలిపారు. స్థానిక జైన్ భవన్‌లో శనివారం ని ర్మాణాలు, సిమెంట్ వాడకంపై తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ద్వారా జర్మనీ టెక్నాలజీతో భారతి సిమెంట్ తయారవుతుందన్నారు.
ఇంజనీర్లు అందిస్తున్న ప్రోత్సాహం, తాపీమేస్త్రీల సహకారంతో భారతి సిమెంట్ వినియోగదారులకు చేరువవుతోందని పేర్కొన్నారు. తాపీమేస్త్రీల సంక్షేమానికి రూ. ల క్ష బీమా సౌకర్యం కల్పిస్తూ మేస్త్రీల పేరున ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ టెక్నీషియన్ సంతోష్‌కుమార్‌తో పాటు డీలర్లు నారాయణరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement