తిడితే.. బైక్‌ బుగ్గే | bike theft arrested at himayathnagar | Sakshi
Sakshi News home page

తిడితే.. బైక్‌ బుగ్గే

Published Wed, Nov 23 2016 10:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

bike theft arrested at himayathnagar

- చంద్రానగర్‌ బస్తీలో రెండు బైక్‌లను కాల్చిన నిందితుడు అరెస్ట్‌

హిమాయత్‌నగర్‌: ఎవరైనా తిడితే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి వాహనాలకు నిప్పుపెట్టు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇన్ స్పెక్టర్‌ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..చంద్రానగర్‌ బస్తీకి చెందిన మణిభూషణ్‌(22)ను అతని బాబాయ్‌ మహేష్‌ అకారణంగా తిట్టేవాడు. దీనిని మనసులో పెట్టుకున్న మణిభూషణ్‌ తన  స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి మహేష్‌కు చెందిన బైక్‌పై  పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు.

అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సమీపంలో ఉన్న నవీన్  వాహనానికి కూడా నిప్పు పెట్టాడు.నిందితుడు జనవరిలో కూడా ఓ బైక్‌కు నిప్పుపెట్టినట్లు విచారణలో వెల్లడయ్యింది. బస్తీకి చెందిన పలువురి బైక్‌ల సీట్లను కోయడం లాంటి పనులు చేసినట్లు అంగీకరించాడు. సీసీ కెమెరాల ఆధారంగా 24గంటల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement