హైదరాబాద్ : ప్రమాదవశాత్తూ సెట్విన్ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి బోరబండ వైపు వెళ్తున్న సెట్విన్ బస్సు ఎర్రమంజిల్ వద్దకు రాగానే.. అటువైపే బైక్ మీద కాస్త ముందు వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు.
ద్విచక్రవాహనానికి, బస్సుకి మధ్య దూరం ఎక్కువగా లేకపోవటంతో బస్సు అతని మీదకెక్కింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సెట్విన్ బస్సు కింద పడ్డ ద్విచక్రవాహనదారుడు
Published Fri, Jun 26 2015 5:46 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement