మహిళా రైతులతో మాట్లాడుతన్న వైఎస్‌ఆర్ సీపీ నేతలు
బిల్లులు మరుగున పడేశారే
Published Sat, Sep 17 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
మా పల్లెలకు బస్సులు రావడం లేదు.
గడప గడపకు వైఎస్‌ఆర్‌లో ప్రజల గోడు
బైరెడ్డిపల్లె:మరుగుదొడ్లు నిర్మించుకున్నా, బిల్లులు మంజూరు చేయలేదు. అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు బాధితులు వైఎస్‌ఆర్ సీపీ నాయకుల వద్ద వాపోయారు. బస్సు సదుపాయం లేకపోవడంతో స్కూళ్లకు వెళ్లడానికి గత్యంతరం లేని స్థితిలో ఆటోలను ఆశ్రయిస్తున్నట్లు పాతపేటకు చెందిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పాతపేట పంచాయతీలో శనివారం గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు మొగసాల రెడ్డెమ్మ, సీ.వీ. కుమార్, రాకేష్‌రెడ్డి ఇళ్లతో పాటు పొలాల వద్ద ఉన్న రైతులు, మహిళలకు వైఎస్‌ఆర్ సీపీ ప్రజాబ్యాలెట్ అందించి, ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం వాగ్దానాలతో మోసిన తీరును వివరించారు. దరఖాస్తులు సమర్పించడం మినహా తమకు పక్కా ఇళ్లు మంజూరు చేయడం లేదన్నారు. వేలిముద్రల సాకుతో బియ్యం ఇవ్వకుండా ఎగవేస్తున్నారన్నారు. రుణమాఫీ, గిరిజనులకు రుణాల మంజూరు హామీలతో మోసం చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్హులకు అందని పథకాలు
అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్‌ఆర్ సీపీ కో–ఆర్డినేటర్లు రెడ్డెమ్మ, సీ.వీ. కుమార్, రాకేష్‌రెడ్డి అన్నారు. కుప్పనపల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటిన సీఎం చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. వాగ్దానాలతో మోసం చేసిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు మొగసాల క్రిష్ణమూర్తి, వాసు, వైస్ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, కన్వీనర్లు ఆర్ కేశవులు, బాలాజీనాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రహ్లాద, కౌన్సిలర్ శ్యాంసుందరరాజు, జిల్లా మైనారిటీ విభాగం ప్రధానకార్యదర్శి అబ్బుఖాన్, ఎంపీటీసీ సభ్యులు అబ్దుల్‌సత్తార్‌సాబ్, రమణారెడ్డి, నారాయణప్ప, వెంకటేష్, ఫైజుల్లా, సర్పంచ్ వెంకటేష్, స్థానిక నాయకులు నారాయణప్ప, రవి, రవికుమార్, రెడ్డెప్ప, కుమార్, లక్ష్మినారాయణ, షణ్ముగం పాల్గొన్నారు.
Advertisement
Advertisement