వానర సుతునికి పుట్టినరోజు వేడుకలు
వానర సుతునికి పుట్టినరోజు వేడుకలు
Published Wed, Jun 21 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
సంజామల: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంటారు. అయితే, సంజామలకు చెందిన మంగళిరాముడు, వెంకటసుబ్బమ్మ దంపతులు తాము పెంచుకుంటున్న వానరానికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని కమలమ్మబావి వీధిలో ఏడాది క్రితం ఓ వానరం ప్రసవించిన మరుక్షణమే మృతి చెందింది. అనాథగా మారిన కోతిపిల్లను గ్రామానికి చెందిన మంగళి రాముడు చేరదీశాడు. మొదట్లో పాలు మాత్రమే తాగే కోతిపిల్ల ప్రస్తుతం పండ్లు, బిస్కట్లు తదితర తింటోంది. బుధవారం ఆ వానరం జన్మదినం కావడంతో కొత్తబట్టలు తీసుకొచ్చి తొడిగించారు. వాడలోని వారినంతా పిలిచి వారి సమక్షంలో రాత్రి 9 గంటలకు కేక్ కట్‌చేసి వానరానికి తినిపించారు. ఆంజనేయస్వామిగా భావించి వానరాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మంగళి రాముడు దంపతులను స్థానికులు మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన పాలకేంద్రం నిర్వాహకులు రఘురామయ్య, నాగరాజులు ఉచితంగా కోతికి పాలు పోస్తున్నారు.
Advertisement