పుట్టపర్తి అర్బన్ : పెళ్లై పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. ఓ వధువు అదృవ్యం కావడం కలకలం రేపుతోంది. పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి కథనం ప్రకారం... ఇదే మండలం చెర్లోపల్లికి చెందిన రఘునాథ్, రమాదేవి దంపతుల కుమార్తె హేమలత వివాహం నల్లమాడ మండలం నల్లశింగయ్యగారిపల్లెకు చెందిన నాగేశ్వరమ్మ, నారాయణప్ప దంపతుల కుమారుడు నాగరాజుతో ఫిబ్రవరి 23న అయింది.
పెళ్లైనప్పటి నుంచి కొత్త జంట అన్యోన్యంగానే ఉందన్నారు. ఈ నెల 5న హేమలతను పుట్టింటి నుంచి మెట్టినింటికి పిల్చుకువచ్చారు. ఈ నెల 8న ఉన్నట్టుండి ఆమె ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. కుటుంబ సభ్యులు అంతటా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వధువు అదృశ్యం
Published Wed, Mar 15 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
Advertisement
Advertisement