నేటి నుంచి బ్రూసెలోసిస్ వ్యాధి నిరోధక టీకాలు
Published Thu, Jul 28 2016 12:20 AM | Last Updated on Sat, Jun 2 2018 8:44 PM
అనంతపురం అగ్రికల్చర్:
గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్రూసెలోసిస్ వ్యాధి టీకాలు ఉచితంగా వేసే కార్యక్రమం చేపట్టినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్, పశువ్యాధి నిర్ధారణ కేం ద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర బుధవారం ప్రకటనలో తెలిపారు.
ప్రధానంగా 6 నుంచి 8 నెలల వయస్సున పెయ్యదూడలకు టీకాలు వేయించుకోవాలని సూచించా రు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో 4,500 పెయ్యదూడలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement