బడ్జెట్‌లో ‘హోదా’ ఊసేది? | budget special status issue | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో ‘హోదా’ ఊసేది?

Published Sat, Feb 4 2017 11:15 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

budget special status issue

  • ఎంపీల వైఫల్యమేనన్న వైఎస్సార్‌ సీపీ విద్యార్థి నేతలు
  • కలెక్టరేట్‌ ఎదుట నిరాహారదీక్ష
  • కాకినాడ : 
    కేంద్రబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట నిరశన దీక్ష చేశారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు ఆదేశాల మేరకు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ  రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో అవసరమైన హోదా ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం ఎంపీల వైఫల్యమేనన్నారు. పార్టీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ప్రత్యే క హోదా కోసం పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుండగా టీడీపీ  ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించా రు.  పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్‌ మాట్లాడుతూ కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ముందు తాక ట్టు పెడుతున్నారని విమర్శించారు. దీక్ష అనంతరం శశిధర్‌ విద్యార్థి విభాగం నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులు కత్తిపూడి శ్రీను, మత్సా లోకేష్‌వర్మ, నాయకులు చిట్నీడి మణికుమార్, ఆర్‌.శ్రవణ్‌ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement