ఇకపై నిర్మాణాల తనిఖీలు
పట్టణ ప్రణాళిక అధికారి ధనుంజయరెడ్డి
‘సాక్షి’ ఎఫెక్ట్‌తో అడుగు ముందుకు
నెహ్రూనగర్: నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ‘ఆన్‌లైన్ దోపిడీ’ శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రచురించిన కథనంపై పట్టణ ప్రణాళికాధికారులు స్పందించారు. వాస్తవానికి నగరంలో ఆన్‌లైన్ ద్వారా ఇచ్చిన భవన నిర్మాణాల అనుమతులపై టాస్క్‌ఫోర్స్ బుధవారం నుంచి తనిఖీలు చేస్తుందని ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడిలతో వాటిని విరమించుకున్నారు. ఇదే సమయంలో ‘సాక్షి’లో బుధవారం వచ్చిన ‘ఆన్‌లైన్ దోపిడీ’ కథనంపై అధికారులు స్పందించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆన్‌లైన్‌లో ఇచ్చిన భవన నిర్మాణ దరఖాస్తులు, నిర్మాణాలను తనిఖీ చేసే బాధ్యత ఆయా డివిజన్‌ల్లోని బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు అధికారులు అప్పగిస్తున్నట్లు సిటీప్లానర్ ధనుంజయరెడ్డి తెలిపారు. అలాగే బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ పథకం కింద గృహానికి బీపీఎస్ నిర్ధారించకున్న బిల్డింగ్ ఇన్‌స్పెక్టరుపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఇక నుంచి ఏసీపీ నుంచి కాకుండా నేరుగా ఏ డివిజన్ దరఖాస్తులను వారికే పంపుతామని తెలిపారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్‌పై చర్యలకు సిఫార్సు చేస్తామని ప్రకటించారు.