ఎమ్మెల్యే దయాకర్‌రావుపై కేసు కొట్టివేత | Cancellation MLA dayakarrao case | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దయాకర్‌రావుపై కేసు కొట్టివేత

Published Tue, Aug 16 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

Cancellation MLA dayakarrao case

వరంగల్‌ లీగల్‌ : విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించి విధులను ఆటంకపర్చారనే అభియోగాలతో జఫర్‌గడ్‌ పోలీసు స్టేషన్‌లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుపై నమోదైన కేసును మంగళవారం మూడో మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి అజేష్‌కుమార్‌ కొట్టివేశారు.
ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం 2012 మార్చిలో స్టేషన్‌ఘన్‌పూర్‌ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరి పక్షాన ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 2012 మార్చి 15న జఫర్‌గడ్‌లో ప్రచార సభ జరగగా, ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించి సభ కొనసాగిస్తుండగా పోలీసులు ఆపివేశారు. అయి తే, విధి నిర్వహణలో ఉన్న తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా విధులను అడ్డుకున్నారని అప్పటి ఎస్సై రంజిత్‌కుమార్‌ ఫిర్యాదు మేర కు కేసు నమోదైంది. ఆ కేసు విచారణ సందర్భంగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో అభియోగాలు నిరూపణ కానందున కేసు కొట్టివేస్తున్నట్లు జడ్జి అజేష్‌కుమార్‌ తీర్పు ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement