MLA dayakarrao
-
రాయపర్తిని వరంగల్‌లోనే కొనసాగించాలి
రాయపర్తి : రాయపర్తి మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ మండలకేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మం డల పరిరక్షణ సమితి నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంరతం ఎమ్మె ల్యే స్పందిస్తూ చారిత్రక నేపథ్యం గల వరంగల్, హన్మకొండలను విడదీయెుద్దని ఉద్యమిం చాలని, అప్పుడే రాయపర్తి వరంగల్ జిల్లాలో కొనసాగుతుందని తెలిపారు. రాయపర్తి మండల పరిరక్షణ కన్వీనర్లు ఐత రాంచందర్, మైస మహేందర్, బీజేపీ మానవహక్కుల జిల్లా కన్వీనర్ రావుల అనిల్‌కుమార్, పరిరక్షణ సమితి కార్యకర్తలు ఖాజామియా, అజ్గర్‌అలీ, ఐత సుధాకర్, బండారి అశోక్, కొండపల్లి సందీప్, ఐత సంపత్, ఐత రాజు, ఎనగందుల శ్రావన్‌కుమార్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే దయాకర్‌రావుపై కేసు కొట్టివేత
వరంగల్ లీగల్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించి విధులను ఆటంకపర్చారనే అభియోగాలతో జఫర్గడ్ పోలీసు స్టేషన్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుపై నమోదైన కేసును మంగళవారం మూడో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి అజేష్‌కుమార్ కొట్టివేశారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2012 మార్చిలో స్టేషన్‌ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరి పక్షాన ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 2012 మార్చి 15న జఫర్గడ్లో ప్రచార సభ జరగగా, ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించి సభ కొనసాగిస్తుండగా పోలీసులు ఆపివేశారు. అయి తే, విధి నిర్వహణలో ఉన్న తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా విధులను అడ్డుకున్నారని అప్పటి ఎస్సై రంజిత్‌కుమార్ ఫిర్యాదు మేర కు కేసు నమోదైంది. ఆ కేసు విచారణ సందర్భంగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో అభియోగాలు నిరూపణ కానందున కేసు కొట్టివేస్తున్నట్లు జడ్జి అజేష్‌కుమార్ తీర్పు ఇచ్చారు.