రాయపర్తిని వరంగల్‌లోనే కొనసాగించాలి
Published Fri, Sep 2 2016 12:28 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM
రాయపర్తి : రాయపర్తి మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ మండలకేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మం డల పరిరక్షణ సమితి నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంరతం ఎమ్మె ల్యే స్పందిస్తూ చారిత్రక నేపథ్యం గల వరంగల్, హన్మకొండలను విడదీయెుద్దని ఉద్యమిం చాలని, అప్పుడే రాయపర్తి వరంగల్ జిల్లాలో కొనసాగుతుందని తెలిపారు.
రాయపర్తి మండల పరిరక్షణ కన్వీనర్‌లు ఐత రాంచందర్, మైస మహేందర్, బీజేపీ మానవహక్కుల జిల్లా కన్వీనర్ రావుల అనిల్‌కుమార్, పరిరక్షణ సమితి కార్యకర్తలు ఖాజామియా, అజ్గర్‌అలీ, ఐత సుధాకర్, బండారి అశోక్, కొండపల్లి సందీప్, ఐత సంపత్, ఐత రాజు, ఎనగందుల శ్రావన్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement