బుక్కపట్నం: కొత్తచెరువు మండలం మామిళ్లకుంట క్రాస్ సమీపంలో సెరికల్చర్ కార్యాలయం వద్ద నాలుగు కిలోల గంజాయి బ్యాగుతో ఉన్న విశాఖ జిల్లా చింతపల్లి మండలం కందులగాదే గ్రామానికి చెందిన వంతల రమేష్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జ్ సీఐ హరినాథ్, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఇన్‌చార్జ్ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి మీడియాకు వివరించారు. గత నెల 26న 44 కిలోల గంజాయితో పట్టుబడ్డ నిందితులు ఎరుకల శీనా, సరోజమ్మలతో ప్రస్తుతం అరెస్టయిన వంతల రమేష్‌కు సంబంధాలు ఉన్నాయన్నారు. శీనా, సరోజమ్మలకు గంజాయి సరఫరా చేసేవాడని, అందులో భాగంగా వారి వద్ద నుంచి డబ్బు తీసుకునేందుకు కొత్తచెరువుకు గంజాయితో వస్తుండగా రమేష్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో మరికొంతమంది ఉన్నారన్నారు. వారినీ త్వరలో పట్టుకుంటామని చెప్పారు.