కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ సేవలు మరింత విస్తృతం | cc centre more active onwards | Sakshi
Sakshi News home page

కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ సేవలు మరింత విస్తృతం

Published Tue, Sep 13 2016 1:23 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

cc centre more active onwards

సీతమ్మధార (విశాఖ) : విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం  ఏపీ ఈపీడీసీఎల్‌  ఏర్పాటు చేసిన కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ సేవలను మరింత విస్తృతం చేసినట్లు సంస్థ సీఎండీ ఎం.ఎం.నాయక్‌ తెలిపారు.    లో– ఓలే్టజ్,  ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, కింది స్థాయి కార్యాలయంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాని విద్యుత్‌ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం    కస్టమర్‌ కేర్‌ సెంటర్‌లోని 1912 నెంబర్‌కు ఫోన్‌ చేసి పరిష్కారం పొందవచ్చునని పేర్కొన్నారు. కార్పొరేట్‌ కార్యాలయంలోని ఏటీసీ భవనంలో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌లో సోమవారం సంస్థ డైరెక్టర్లతో సీఎండీ సమావేశమయ్యారు. కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి విద్యుత్‌ సంబంధిత సమస్యలను తెలియజేసేందుకు వచ్చే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కస్టమర్‌ కేర్‌ సెంటర్‌   సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక ఏడీఈని పూర్తిస్థాయిలో నియమించినట్లు పేర్కొన్నారు.  నమోదైన ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల వినియోగదారులు  ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో  సంస్థ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టి.వి.ఎస్‌.చంద్రశేఖర్, ఆపరేషన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పి.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement