జోళదరాశిలో సినిమా షూటింగ్
జోళదరాశిలో సినిమా షూటింగ్
Published Thu, Oct 20 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
కోవెలకుంట్ల: జోళదరాశి గ్రామంలో గురువారం ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మంజునాథ్, తనీష్ తివారీ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమాకు సంబంధించి షూటింగ్ కొనసాగుతోంది. 15 రోజులపాటు జరిగే షూటింగ్‌లో సినిమా అంతా ఇక్కడే చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు మా ఊరి ప్రేమ కథ, మన ఊరి ప్రేమకథ, ఊరి ప్రేమక£ý పేర్లు పరిశీలనలో ఉన్నట్లు మేనేజర్ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సినిమాకు కోనేటి శ్రీనివాస్ దర్శకత్వం, మల్లికార్జున స్వామి నిర్మాత, కేఎస్ పాల్ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌గా కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. గ్రామ సర్పంచ్ నాగేశ్వరమ్మ ఇంట్లో ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిరోజు సాయిబాబా గుడి, గ్రామ నడిబొడ్డున వివిధ సన్నివేశాలు చిత్రీకరించారు.
Advertisement
Advertisement